పవన్ కళ్యాణ్‌కు చిన్మయి స్ట్రాంగ్ కౌంటర్.. పోస్ట్ వైరల్ !!
చిన్మయి శ్రీపాద.. తెలుగు ప్రేక్షకులకు ఈమె గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సింగర్ గానే కాకుండా డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా కూడా ప్రేక్షకుల్లో గుర్తింపు తెచ్చుకుంది. ముఖ్యంగా హీరోయిన్ సమంత, లావణ్య త్రిపాఠి సహా పలువురు హీరోయిన్స్ ఆమె డబ్బింగ్‌తోనే ఆడియన్స్‌కి మరింత చేరువయ్యారు. అంతే కాకుండా ఆమె నటుడు, దర్శకుడు రాహుల్ రవీంద్ర భార్య అని అందరికీ తెలిసిందే. కాగా సోషల్ మీడియా లోనూ యాక్టివ్ గా ఉండే ఈమె.. తన వ్యక్తిగత విషయాలతో పాటు, సామాజిక అంశాలపై కూడా స్పందిస్తూ నిత్యం వార్తల్లో నిలుస్తుంటారు. ఇప్పుడు లేటెస్ట్ గా పవన్ కళ్యాణ్ కి ఆమె స్ట్రాంగ్ రిప్లై ఇవ్వడం సినీ వర్గాలలో చర్చనీయాంశంగా మారింది.
కాగా గతంలో తమిళ సినీ గీత రచయిత వైరముత్తుపై సింగర్ చిన్మయి శ్రీపాద లైంగిక ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. 'మీటూ' ఉద్యమం సమయంలో ఆమె చేసిన ఆరోపణలు సంచలనం సృష్టించాయి. ఇప్పుడు లేటస్ట్ గా ఆయనకు జ్ఞానపీఠ్ అవార్డు ప్రకటించారు. ఈ క్రమంలోనే సినీ, రాజకీయ ప్రముఖులు వైరముత్తుకు అభినందనలు తెలుపుతూ పోస్టులు పెడుతున్నారు. దీని పట్ల ఆమె అసహనం వ్యక్తం చేస్తూ.. వైరముత్తు కోసం పోస్టులు పెట్టిన వారికి కౌంటర్ ఇస్తుంది. అందులో భాగంగానే పవన్ కళ్యాణ్ ని కూడా లాగడం హాట్ టాపిక్ గా మారింది.

పవన్ ఏం పోస్ట్ చేశారంటే..
ప్రముఖ తమిళ కవి, సినీ గీత రచయిత 'కవి పేరరసు' వైరముత్తు గారు జ్ఞానపీఠ్ పురస్కారానికి ఎంపికైన తరుణంలో వారికి నా హృదయపూర్వక అభినందనలు. తమిళ సాహిత్యంలో వైరముత్తుకి ప్రత్యేక స్థానం ఉంది. సినీ గీత రచయితగానే కాకుండా కవితలు, నవలలు రచించారు. ఆయన రచనల్లో సామాజిక స్పృహ, మానవ సంబంధాలలోని సున్నితత్వాన్ని చూపిస్తారు. సినీ గీత రచయితగా ఏడు జాతీయ సినీ పురస్కారాలు అందుకొన్న ఘనత ఆయన సొంతం. జ్ఞానపీఠ్ పురస్కారంతో వైరముత్తు సాహితీ సేవలకు విశిష్ట గుర్తింపు దక్కింది. వైరముత్తుకి సంపూర్ణ ఆరోగ్యం, సంతోషాలు దక్కాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నానని పేర్కొన్నారు.
చిన్మయి రియాక్షన్..
గౌరవంతో చెబుతున్నాను.. పవన్ కళ్యాణ్ కి ఆ కవి అసలు స్వరూపం గురించి ఏమీ తెలియదని నాకు ఖచ్చితంగా తెలుసు. ఎంతో మంది మహిళలపై ఆయన చేసిన లైంగిక వేధింపులకు 'సంపూర్ణ ఆరోగ్యం, ఆనందం'గా ఉండాలని కోరుకుంటున్నానని పవన్ కళ్యాణ్ కార్యాలయం ఆయనకు తెలియజేయాలి. అసలు ఇంతమంది రాజకీయ నాయకులు ఒక సినిమా పాటల రచయితకు శుభాకాంక్షలు చెప్పాల్సిన అవసరం ఏముందో నాకు అర్థం కావడం లేదు" అంటూ చిన్మయి రాసుకొచ్చింది. మరోవైపు వైరముత్తును అభినందించిన సీనియర్ హీరోలు కమల్ హాసన్, రజనీకాంత్ లను కూడా చిన్మయి విమర్శించింది.
కాగా రీసెంట్ గానే ది గర్ల్ ఫ్రెండ్ మూవీ రిలీజ్ టైంలో చిన్మయి.. ఆమె భర్త రాహుల్ ట్రోలింగ్ కి గురయ్యారు. మంగళ సూత్రంపై రాహుల్ రవీంద్రన్ మాట్లాడిన వీడియోపై దారుణమైన కామెంట్లు చేశారు. తన భర్త వ్యాఖ్యలకు చిన్మయి సపోర్టుగా రావడంతో.. ఆమెపై కూడా తీవ్రస్థాయిలో ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో ట్విట్టర్ స్పేస్ వేదికగా రాహుల్- చిన్మయి దంపతులను తీవ్రంగా విమర్శించారు. చిన్మయి లాంటి వారికి పిల్లలు పుట్టకూడదని, పుట్టినా వెంటనే చనిపోవాలని కామెంట్స్ చేశారు. రాయడానికి వీలుకాని తీవ్రమైన అసభ్య పదజాలంతో దూషించారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఆమె.. ఎక్స్ వేదికగా సీపీ సజ్జనార్ కు ఫిర్యాదు చేశారు.
-
పవన్ Vs విజయ్, మమత- చంద్రబాబు : ఆ రెండు రాష్ట్రాల్లో మోదీ బిగ్ టాస్క్..!? -
ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా 17 లిప్ లాక్స్.. ఫస్ట్ మూవీ లోనే ! -
దివ్యాంగులకు అండగా "పెద్ది" సినిమా నిర్మాత వెంకట సతీష్ కిలారు..! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
రాజకీయ దురంధురుడు చంద్రబాబు: స్టీల్ ప్లాంట్ భూమిపూజలో పవన్ కళ్యాణ్ కితాబు! -
హిందీ స్టార్ హీరోల వేధింపుల వల్లే డైరెక్టర్లకు కష్టాలు.. -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం












Click it and Unblock the Notifications