Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

7 గంటల సీబీఐ గ్రిల్లింగ్ తర్వాతా ఖుషీగా విజయ్- కొంపదీసి..??

నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల తేదీలను కేంద్ర ఎన్నికల కమిషన్ ప్రకటించింది. ఏప్రిల్ 9వ తేదీన కేరళ, అదే నెల 23వ తేదీన తమిళనాడు అసెంబ్లీకి ఎన్నికలు జరుగనున్నాయి. ఒకేదశలో ఇవి ముగుస్తాయి. మే 4వ తేదీన ఓట్లను లెక్కిస్తారు. ఈ వివరాలను కేంద్ర ఎన్నికల కమిషన్ ప్రకటించింది. ఎన్నికలు ఎదుర్కొంటోన్న నాలుగు రాష్ట్రాల్లో పశ్చిమ బెంగాల్ కూడా ఉంది. ఈ రాష్ట్రంతో పాటు తమిళనాడు, కేరళ, అస్సాం, కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరీ ఉన్నాయి.

సాధారణంగా తమిళనాడు, కేరళ అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి జరుగుతాయి. ఈ సారి మాత్రం దీనికి భిన్నమైన పరిస్థితులు నెలకొన్నాయి. కేరళ, తమిళనాడు ఎన్నికల తేదీలను కేంద్ర ఎన్నికల కమిషన్ విడదీసింది. కేరళలో పోలింగ్ ముగిసిన తర్వాత అంటే 23వ తేదీన తమిళనాడులో ఓట్లు జరుగనుంది. ఈ రెండు రాష్ట్రాల మధ్య రెండు వారాల పాటు గడువు ఉంది. ఇది రాజకీయంగా తీవ్ర చర్చలకు దారి తీసింది.

Vijay Grilled by CBI for 7 Hours Exits in Cinema-Style Wave to Fans and Leaves on Car Sunroof

పొత్తుపై విజయ్ తో చర్చలు కొనసాగించడానికే బీజేపీ ఈ రెండు వారాల గడువును సాధించుకున్నట్టయిందనే అభిప్రాయాలు వ్యక్తమౌతోన్నాయి. ఈ గడువులో టీవీకేతో పొత్తు చర్చలు ముమ్మరం చేయాలనేది బీజేపీ వ్యూహంగా భావిస్తోన్నారు. ఎలాగైనా సరే.. ఆయనను ఒప్పించాలని పట్టుదలతో కమలనాథులు ఉన్నారనేది దీంతో మరోసారి స్పష్టమైనట్టే.

ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన రోజు ఢిల్లీలో ఉన్నారు విజయ్. సీబీఐ విచారణకు హాజరయ్యారు. కరూర్ కేసు విచారణలో భాగంగా ఢిల్లీలోని సీబీఐ ప్రధాన కార్యాలయంలో సుమారు ఏడు గంటల పాటు ఆయనను ప్రశ్నించారు. ఉదయం 10:30 గంటల సమయంలో విచారణకు హాజరైన విజయ్.. మళ్లీ బయటికొచ్చింది.. సాయంత్రం 6 గంటల తర్వాతే.

ఆ సమయంలో విజయ్ ఖుషీగా కనిపించారు. సీబీఐ ప్రధాన కార్యాలయం ఆవరణలో నుండే కారు సన్ రూఫ్ పై నిల్చుని కనిపించాడు. అభివాదం చేస్తూ సినిమాటిక్ గా బయటికొచ్చాడు. ఏడు గంటల పాటు విచారణను ఎదుర్కొన్న ఒత్తిడి ఆయనలో ఏ కోశానా కనిపించలేదు. బయట వేచి ఉన్న మద్దతుదారులకు చిరునవ్వుతో అభివాదం చేస్తూ వచ్చారు. ఎటువంటి హడావుడి లేకుండా ప్రశాంతంగా అక్కడి నుండి హోటల్ కు నిష్క్రమించారు. ఇది ప్రాధాన్యతను సంతరించుకుంది.

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే- బీజేపీ కూటమి గెలిస్తే విజయ్‌కి ఉప ముఖ్యమంత్రి పదవిని ఆఫర్ చేసినట్లు సమాచారం. దీంతో పాటు- టీవీకేకు సుమారు 80 అసెంబ్లీ సీట్లు ఆఫర్ చేసినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. దీనిపై టీవీకే ఇప్పటికిప్పుడు ఎటువంటి నిర్ణయాలను తీసుకోలేదని అంటున్నారు. ఈ ప్రతిపాదనలకు సంబంధించిన వార్తలు వెలుగులోకి వచ్చిన రోజే విజయ్ సీబీఐ విచారణను ఎదుర్కొన్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+