విజయ్- త్రిష పెళ్లికి త్రిష తల్లి గ్రీన్ సిగ్నల్..?
తమిళనాట ఓవైపు ఎన్నికల హడావుడి ఉంటే మరోవైపు టీవీకే అధ్యక్షుడు, దళపతి విజయ్ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. విజయ్ భార్య ఇటీవల ఫ్యామిలీ కోర్టులో విడాకులు అప్లై చేయడంతో ఈ వ్యవహారం నెట్టింట చర్చనీయాంశంగా మారింది. విడాకుల సమయంలో విజయ్ భార్య సంగీత కీలక కామెంట్స్ చేశారు.తన భర్త ఇండస్ట్రీలోని ఓ హీరోయిన్ తో అఫైర్ పెట్టుకున్నాడని అన్నారు. తనకు న్యాయం జరగకపోతే ఆమె ఎవరో బయటపెడతానని సంచలన ఆరోపణలు చేశారు. దాంతో సౌత్ బ్యూటీ త్రిష ఒక్కసారిగా తెరపైకి వచ్చారు.
విజయ్ భార్య సంగీత.. పరోక్షంగా త్రిషపై కామెంట్స్ చేసినట్లు తమిళ మీడియా కోడై కూస్తోంది. మరోవైపు ఇటీవల చెన్నైలోని ఓ వివాహ వేడుకకు విజయ్- త్రిష ఒకే కారులో వచ్చారు. అంతేకాక ఇద్దరూ ఒకే అవుట్ ఫిట్ ధరించారు. దాంతో వీరి మధ్య రిలేషన్ రూమర్స్ మరింత బలాన్ని చేకూర్చాయి. ఇప్పుడు తాజాగా మరోవార్త వైరల్ అవుతోంది. విజయ్- త్రిష పెళ్లిపై ఇటీవలి కాలంలో సామాజిక మాధ్యమాల్లో కొన్ని పోస్టులు వచ్చిన విషయం తెలిసిందే.
అయితే తాజాగా విజయ్- త్రిష పెళ్లికి సంబంధించిన ఓ పోస్టుకు త్రిష తల్లి ఉమా కృష్ణన్ లైక్ కొట్టారు. దాంతో సోషల్ మీడియా ఒక్కసారిగా హీటెక్కింది. తమిళనాడు ఎలక్షన్స్ తర్వాత విజయ్- త్రిష పెళ్లి చేసుకుంటారన్న ఆ పోస్టుకు త్రిష తల్లి లైక్ కొట్టడంపై నెట్టింట ప్రచారం జరుగుతోంది. పరోక్షంగా వీరి వివాహానికి త్రిష తల్లి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు స్పష్టం అవుతోంది.
ఇక విజయ్- సంగీత దంపతులకు 1999 లో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. కుమారుడు జాసన్ సంజయ్, కుమార్తె సాష.. ఇక కుమారుడు జాసన్ సంజయ్ ప్రస్తుతం విజయ్ పై ఆగ్రహంతో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఇటీవల సంజయ్ తన ఇంటి పేరును తొలగించడమే కారణం అని సమాచారం. ఈ పరిణామాల మధ్య విజయ్ స్థాపించిన టీవీకే పార్టీ తొలిసారిగా తమిళనాట బరిలోకి దిగనుంది.

మరోవైపు విజయ్- త్రిష జోడీ ఆన్ స్క్రీన్ పై బెస్ట్ గా ఫ్యాన్స్ చెబుతారు. వీరి కాంబోలో మొత్తం 5 సినిమాలు చేయగా అందులో 'గిల్లి', 'తిరుపాచి', 'లియో' వంటి బ్లాక్ బస్టర్ హిట్లు ఉన్నాయి.
-
విజయ్ను భయపెట్టిన అభిమాని.. సైకిల్ ఆపి పరుగో పరుగు! వీడియో -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
విజయ్ కు బిగ్ షాక్.. -
అతిపెద్ద నిర్ణయాన్ని తీసుకోబోతున్నాం- తేల్చి చెప్పిన ప్రధాని మోదీ -
కటౌట్ కు తగ్గ పర్ఫెక్ట్ ఫిల్మ్- టైటిల్ గూస్ బంప్స్: విజువల్ వండర్ -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
రేషన్ సరఫరా లో కీలక మార్పులు, తాజా మార్గదర్శకాలు..!! -
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..? -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- ఆందోళనకరం












Click it and Unblock the Notifications