Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

కుప్పకూలుతున్న పసిడి ధరలు- భారీగా క్రాష్

దేశంలో బంగారం, వెండి ధరల్లో భారీ పతనం నెలకొంది. కొంతకాలంగా కుప్పకూలుతూ వస్తోన్న పసిడి రేట్లకు ఎక్కడా బ్రేకులు పడట్లేదు. రెండు వారాల కనిష్టస్థాయికి క్షీణించాయి. ఈ ఉదయం 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 1,59,170 రూపాయలకు పడిపోయింది. 22 క్యారెట్లు రూ. 1,45,900 కు అందుబాటులో ఉంది. అంతర్జాతీయంగా డాలర్ బలపడటం, ముడి చమురు ధరలు పెరగడం వంటి కారణాలతో బంగారం, వెండి ధరలు పడిపోయాయి.

దేశంలోని ప్రధాన నగరాల్లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధరలను పరిశీలిస్తే- ఢిల్లీ, జైపూర్‌లో రూ. 1,59,300 ఉండగా, అహ్మదాబాద్‌లో రూ. 1,59,200 వద్ద ట్రేడ్ అవుతోంది. పుణె, ముంబై, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, కోల్‌కతా వంటి నగరాల్లో రూ. 1,59,170గా నమోదైంది. 22 క్యారెట్ల బంగారం ధరల్లోనూ పెద్దగా తేడాలు లేవు. ఢిల్లీ, జైపూర్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 1,46,050 వద్ద కొనసాగుతోంది. అహ్మదాబాద్‌లో రూ. 1,45,950 కాగా, పుణె, ముంబై, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, కోల్‌కతా నగరాల్లో రూ. 1,45,900లకు చేరింది.

Gold Rates Edges Down on as Dollar Weakens 24K Yellow Metal at Rs 159170 per 10 gram

యూఎస్ స్పాట్ గోల్డ్ 0.2 శాతం మేర తగ్గి ఔన్స్‌కు 5,007.58 డాలర్ల వద్ద స్థిరపడింది. ఏప్రిల్ డెలివరీ కోసం US గోల్డ్ ఫ్యూచర్స్ ఏకంగా ఒక శాతం తగ్గి 5,011.10 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది. డాలర్ విలువ స్వల్పంగా తగ్గడంతో ఇతర కరెన్సీల హోల్డర్లకు బంగారం వంటి డాలర్లలో వస్తువులు చౌకగా మారాయి. అమెరికా 10 సంవత్సరాల ట్రెజరీ ఈల్డ్స్ తగ్గడం కూడా బంగారం, వెండి రేట్లపై ప్రభావం చూపింది.

ప్రధాన నగరాల్లో నేటి బంగారం ధరలు (గ్రాముకు)

చెన్నై..

24 క్యారెట్లు- రూ. 16,101, 22 క్యారెట్లు - రూ. 14,759, 18 క్యారెట్లు - రూ. 12,399

ముంబై..

24 క్యారెట్లు - రూ. 15,917, 22 క్యారెట్లు- రూ. 14,590, 18 క్యారెట్లు - రూ. 11,938

బెంగళూరు..

24 క్యారెట్లు - రూ. 15,917, 22 క్యారెట్లు- రూ. 14,590, 18 క్యారెట్లు - రూ. 11,938

హైదరాబాద్..

24 క్యారెట్లు - రూ. 15,917, 22 క్యారెట్లు- రూ. 14,590, 18 క్యారెట్లు - రూ. 11,938

విజయవాడ..

24 క్యారెట్లు - రూ. 15,917, 22 క్యారెట్లు- రూ. 14,590, 18 క్యారెట్లు - రూ. 11,938

విశాఖపట్నం..

24 క్యారెట్లు - రూ. 15,917, 22 క్యారెట్లు- రూ. 14,590, 18 క్యారెట్లు - రూ. 11,938

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+