భారీ వర్షాలు - ఏపీ లో ఈ జిల్లాలకు తీవ్ర హెచ్చరిక..!!
తెలుగు రాష్ట్రాల్లో భిన్నమైన వాతావరణ పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఉదయం సమయం లో ఎండల తీవ్రత .. సాయంత్రం సమయానికి ఈదురుగాలులతో వర్షాలు కురుస్తున్నాయి. దీంతో, ఈ తరహాలో వాతావరణం లో వస్తున్న అనూహ్య మార్పులతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇక, ఇదే సమయంలో వాతావరణ శాఖ తెలుగు రాష్ట్రాల్లో పలు జిల్లాలకు హెచ్చరికలు జారీ చేసింది. ఈదురు గాలులతో పాటుగా భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది.
ఏపీలో పలు జిల్లాల్లో 41 - 43 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదు కానున్నాయి. తాజాగా వాతావరణ శాఖ తాజా అలర్ట్స్ జారీ అయ్యాయి. ఇప్పటికే పలు జిల్లాలో గరిష్ఠ స్థాయిలో ఉష్ణోగ్రత లు నమోదయ్యాయి. నంద్యాల జిల్లా పసుపులలో 42.5 డిగ్రీలు ఉష్ణోగ్రత లు నమోదు కాగా, వైఎస్సార్ జిల్లా జమ్మలమడుగులో 42.4 డిగ్రీలు, పల్నాడు జిల్లా రావిపాడులో 42.1 డిగ్రీలు, కర్నూలు జిల్లా కలుగోట్ల 41.8 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అయితే ఈ రోజు (మంగళవారం కూడా ఇలాంటి పరిస్థితులే నెలకొంటాయని వాతావరణశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.

మరోవైపు ఈదురుగాలులతో కూడిన వర్షాలు కూడా పడొచ్చని తెలుస్తోంది. శ్రీకాకుళం, విజయ నగరం, పార్వతీపురంమన్యం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో పలుచోట్ల ఉరుములతో కూడిన మోస్తారు నుంచి భారీ వర్షాలు, 50-60కిమీ వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉన్నట్టు వాతావరణశాఖ వెల్లడించింది. ఈ రోజు, రేపు (బుధవారం) భిన్న వాతావరణ పరిస్థితులు ఉంటాయని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. శ్రీకాకుళం, విజయన గరం, మన్యం, అల్లూరి, అనకాపల్లి, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో పలు చోట్ల పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండగా, గంటకు 50-60కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది.
కోస్తా జిల్లాల్లో ప్రధానంగా విశాఖపట్నం, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడా పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు పడతాయని వివరించింది. మేఘాలు కమ్ముకున్న వెంటనే పొలాలు, తోటల్లో ఉండే వారంతా సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించారు. ఈ నెల మొత్తం పిడుగులు, ఈదురుగాలుల తీవ్రత అధికంగా ఉంటుందని అంచనా వేసారు.












Click it and Unblock the Notifications