ముంచుకొస్తోంది, మళ్లీ కుండపోత వానలు - ఈ జిల్లాలకు తాజా హెచ్చరిక..!!
తెలుగు రాష్ట్రాల్లో ఉదయం ఎండ.. సాయంత్రం వర్షం సాధారణంగా మారింది. గత కొద్ది రోజులుగా ఇదే తరహా వాతావరణం కొనసాగుతోంది. రుతుపవనాలు వెళ్లిపోయినా... బంగాళాఖాతంలో తాజాగా మరో అల్ప పీడనం ఏర్పడుతోంది. ప్రస్తుతం ద్రోణి కొనసాగుతోంది. దీని ఫలితంగా ఏపీ తో పాటుగా తెలంగాణలోని పలు జిల్లాల్లో రానున్న రెండు రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ మేరకు పలు జిల్లాలను అలెర్ట్ చేసింది.
ఏపీ, తెలంగాణలో కొద్ది రోజులుగా వర్షాలు దంచికొడుతున్నాయి. కాగా, రేపు (శనివారం) బంగాళా ఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. అదే విధంగా కొనసాగుతున్న ద్రోణి ప్రభావంతో పలు ప్రాంతాల్లో వచ్చే 24గంటల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని, ముఖ్యంగా ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో శుక్ర, శనివారాల్లో వర్షాలు కురిసే చాన్స్ ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. పలు ప్రాంతాల్లో పిడుగులతో కూడిన భారీ వర్షాలు.. కుండపోత వర్షాలు కురిసే చాన్స్ ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. కోస్తా జిల్లాల్లో కొద్ది రోజులుగా ప్రతీ రోజు సాయంత్రం సమయంలో ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నెల 13వ తేదీ వరకు వర్షాలు కొనసాగుతాయని అధికారులు అలర్ట్స్ జారీ చేసారు.

బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం మరింత బలపడి ఈనెల 11నాటికి అల్ప పీడనంగా మారే అవకాశం ఉన్నదని వెల్లడించింది. దీంతో వచ్చేవారం మళ్లీ కుండపోత వర్షాలు తప్పవని పేర్కొన్నది. తెలంగాణలోనూ భారీ వర్షాలు కురవనున్నాయి. శుక్రవారం భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, మహబూబాబాద్ జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, గంటకు 30 నుంచి 40 కి.మీ వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని తెలిపింది. శనివారం, ఆదివారాల్లో భద్రాద్రి-కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, మహబూబాబాద్ జిల్లాలలో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని వివరించింది.












Click it and Unblock the Notifications