దంచి కొడుతున్న ఎండల వేళ భారీ వర్షాలు, ఈ ప్రాంతాలకు తాజా హెచ్చరికలు..!!

తెలుగు రాష్ట్రాల్లో విభిన్న వాతావరణ పరిస్థితులు నెలకున్నాయి. ఒకవైపు ఎండలు తీవ్రంగా మండుతుండగా, మరోవైపు పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు హెచ్చరి స్తున్నారు. ఉత్తరాంధ్ర జిల్లాల్లో వేడి గాలులు వీచే అవకాశం ఉంది. అదే సమయంలో రాయల సీమ ప్రాంతంలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఇదే సమయంలో ఉపరితల ద్రోణి కారణంగా పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.

ఏపీ, తెలంగాణలో తీవ్రమైన వేడి గాలులు ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. ముఖ్యంగా విజయనగరం జిల్లాలోని బాడంగి, బొబ్బిలి, తెర్లాం, వంగర ప్రాంతాలు, అలాగే పార్వతీపురం జిల్లాలోని పలు మండలాల్లో వడగాలులు తీవ్రంగా వీచే అవకాశముందని హెచ్చరించారు. ఈ పరిస్థితుల్లో మహిళలు, చిన్నపిల్లలు, వృద్ధులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు
ముఖ్యంగా మధ్యాహ్న సమయంలో బయటకు వెళ్లే వారు అత్యంత జాగ్రత్తగా ఉండాలని సూచిస్తు న్నారు. తెలంగాణ, రాయలసీమ, తమిళనాడు మీదుగా మన్నార్ వరకు ఈ ద్రోణి కొనసాగుతోంది. దీని ప్రభావంతో విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఏప్రిల్‌ ఆరంభం లోనే తెలుగు రాష్ట్రాల్లో ఎండలు దంచికొడుతున్నాయి.

imd-latest-alerts-on-heat-waves-temperatures-to-cross-41-degrees-celsius-in-next-four-days

మారుతున్న వాతావరణం.. తాజా హెచ్చరికలు

తెలంగాణలోని దాదాపు 20 జిల్లాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో ఆయా జిల్లాలకు హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం ఆరెంజ్‌ అలర్జ్‌ జారీ చేసింది.వచ్చే మూడ్రోజులు ఉష్ణోగ్రతలు 2 నుంచి 3 డిగ్రీలు పెరుగుతాయని వెల్లడించింది. గతేడాదితో పోలిస్తే ఈ సారి అన్ని జిల్లాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నట్లు పేర్కొంది. ఖమ్మం జిల్లా తిరుమలాయ పాలెం లో అత్యధికంగా 41.6 డిగ్రీలు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెంలో 41.5 డిగ్రీలు, నల్లగొండ జిల్లా నేరడుగొమ్మలో 41.5 డిగ్రీలు, సూర్యాపేట జిల్లా మేళ్లచెర్వులో 41.4 డిగ్రీలు, జనగామ జిల్లా పాలకుర్తిలో 41.2 డిగ్రీలు, వరంగల్‌ జిల్లా సంగెంలో 41.2 డిగ్రీలు, హైదరాబాద్‌లో 38 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైందని వెల్లడించింది. గురువారం కూడా గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. పగటి సమయంలో ప్రజలు బయటకు వెళ్లేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. పగటి సమయంలో ప్రజలు బయటకు వెళ్లేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+