వాతావరణ కేంద్రం చల్లటి కబురు - కానీ, బీ అలర్ట్..!!

ఎండలు మండిపోతున్నాయి. ఉక్కపోతతో సాధారణ ప్రజలు అల్లాడిపోతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వాతావరణ శాఖ వడగల్పుల పైన హెచ్చరికలు చేసింది. ప్రాంతాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు రికార్డు అవుతున్నాయి. ఇదే సమయంలో రెండు రోజులపాటు ఎండలు కొంత మేర తగ్గి వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ వాతావరణ అంచనా వేసింది. ఇదే సమయంలో మరో కీలక హెచ్చరిక జారీ చేసింది.

వడగాల్పుల తీవ్రత
రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ వడగాల్పుల తీవ్రత పెరిగింది. ఈరోజు రేపు మరింతగా వడగాలి పులిబిడ్డ అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరించింది. ఉష్ణోగ్రతలు సైతం ప్రస్తుతం కంటే రెండు మూడు డిగ్రీలు ఎక్కువగా నమోదు కావచ్చని పేర్కొంది. ఎండలు 43 డిగ్రీలకు పైగా నమోదవుతున్నాయని, ఉదయం 11 నుంచి సాయంత్రం నాలుగున్నర గంటల వరకు ప్రజలు బయటికి రావద్దని సూచించింది. అత్యవసర పరిస్థితిలో బయటకు వెళ్తే తగిన చర్యలు తీసుకోవాలని పేర్కొంది. ఈనెల ఏడో తేదీ తర్వాత ఉష్ణోగ్రతలు కాస్త తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని అంచనా వేసింది.

IMD Predicts heat wave conditions in the many parts expected rains in Telangana Districts

మూడు రోజుల వానలు
శుక్రవారం నల్గొండ జిల్లాలోని ఇబ్రహీంపట్నంలో 43.5, కనగల్ లో 43.4, మాడుగుల పల్లిలో 43.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు వాతావరణ శాఖ వివరించింది. పెరుగుతున్న ఉష్ణోగ్రత ప్రజలు అస్వస్థకు గురవుతున్నారు. డిహైడ్రేషన్ కేసులు పెరుగుతున్నాయి. వేసవికాలంలో కొబ్బరి నీళ్లు లేదా ఒఆర్ఎస్ వంటివి తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ఈ హెచ్చరికల నడుమ వాతావరణ శాఖ మరో కీలక సమాచారం ఇచ్చింది. ఆదివారం నుంచి తెలంగాణలో అక్కడక్కడ వర్షాలు కురుస్తాయని తెలిపింది.

అప్రమత్తంగా ఉండాలి
మూడు రోజులపాటు ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వానలు పడతాయని వెల్లడించింది, పలు జిల్లాలో వర్షాలు కురిసే అవకాశం ఉన్నా, హైదరాబాదులో మాత్రం ఆ అవకాశం లేదని స్పష్టం చేసింది. ఈనెల 7, 8 తేదీల్లో మధ్యప్రదేశ్, విదర్బా, చత్తీస్ గడ్ లో భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని అంచనా వేసింది. ఇటు వర్షాలు ఉన్నప్పటికీ వచ్చే రెండు రోజుల్లో పెరిగే వడగాల్పులు, అధిక ఉష్ణోగ్రతల కారణంగా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+