ఈదురుగాలులు, భారీ వర్షాలు - ఏపీలో ఈ జిల్లాలకు భారీ హెచ్చరిక..!!

తెలుగు రాష్ట్రాల్లో వాతావరణంలో భిన్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. వేసవి తీవ్రత కొనసాగుతున్న వేళ భారీ వర్షాలు కురుస్తున్నాయి. పలు ప్రాంతాల్లో ఈదురు గాలులతో భారీ వర్షాలు కొనసాగుతు న్నాయి. ఈ సమయంలోనే వాతావరణ శాఖ బిగ్ అలర్ట్ జారీ చేసింది. రానున్న రెండు రోజులు తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. ఒక వైపు మండే ఎండలు.. మరో వైపు భారీ వర్షాలతో జనం ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. ఇక, ఇప్పుడున్న పరిస్థితు ల్లో వాతావరణ శాఖ తాజా అలర్ట్స్ లో యంత్రాంగం అప్రమత్తం అయింది.

ఏపీలో ఈ రోజు (గురువారం) పలుచోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు, 40-50కిమీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ వెల్లడించారు. మరోవైపు రేపు గరిష్ట ఉష్ణోగ్రతలు 40°C - 42°C మధ్య రికార్డు అయ్యే అవకాశం ఉందని, శుక్రవారం నుంచి ఉష్ణోగ్రతల తీవ్రత పెరిగే అవకాశం ఉందని తెలిపారు. శుక్రవారం 15 మండలాల్లో తీవ్ర వడగాలులు, 28 మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని చెప్పారు. నాటికి అంబేద్కర్ కోనసీమ జిల్లా మధ్యకొంపలులో 86మిమీ, రామచంద్రపురంలో 73.5మిమీ, కొత్తపేటలో 64.5మిమీ, శ్రీకాకుళం జిల్లా నివగాంలో 52మిమీ, అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో 48.7మిమీ, కాకినాడ జిల్లా పెద్దాపురంలో 44 మిమీ మే వర్షం నమోదైంది.

imd-predicts-heavy-rains-in-telugu-states-in-next-two-days

ఇక, తూర్పుగోదావరి జిల్లా ఉండ్రాజవరంలో 42.5మిమీ చొప్పున వర్షపాతం నమోదైనట్లు వెల్లడిం చారు. వైఎస్సార్ జిల్లా సింహాద్రిపురంలో 40.7°C, నంద్యాల జిల్లా గుల్లదుర్తి, కర్నూలు జిల్లా నేమకల్లులో 40.6°C, పల్నాడు జిల్లా కాకానిలో 40.2°C చొప్పున అధిక ఉష్ణోగ్రతలు నమోదైనట్లు తెలిపారు. ఈదురుగాలులు పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇటు తెలంగాణలో గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే నాలుగు డిగ్రీలు తక్కువగా ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీంతో గురువారం(మే 08) తెలంగాణలోని 14 జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ జారీ చేశారు. రేపు తెలంగాణలో తేలికపాటి నుండి ఒక మోస్తారు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. అలాగే రేపు ఉష్ణోగ్రతలు 40°C - 42°C మధ్య రికార్డు అయ్యే అవకాశం ఉందని, ఎల్లుండి నుంచి ఉష్ణోగ్రతల తీవ్రత పెరిగే అవకాశం ఉన్నట్లు వెల్లడించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+