అల్పపీడనం, రుతుపవనాల ఎంట్రీ - ఏపీలో ఈ జిల్లాల్లో ఇక కుండపోత..!!
తెలుగు రాష్ట్రాల్లో కూల్ వాతావరణం నెలకొంది. ఈ సారి ముందస్తుగానే రుతుపవనాలు తెలుగు రాష్ట్రాల్లోకి ఎంట్రీ ఇస్తున్నాయి. రానున్న 48 గంటల్లో రాయలసీమ ప్రాంతంలోకి రుతుపవనాలు ప్రవేశించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. అటు బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావం కనిపిస్తోంది. దీంతో, రానున్న రెండు రోజుల్లో ఏపీ, తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలకు ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ అలర్ట్స్ జారీ చేసింది.
నైరుతి రుతుపవనాలు ఇప్పటికే కేరళను తాకాయి. మరో రెండు రోజుల్లో రుతుపవనాలు ఆంధ్ర ప్రదేశ్‌తో పాటు తెలంగాణ, గోవా, మహారాష్ట్ర, కర్ణాటక, పశ్చిమ బెంగాల్, సిక్కిం రాష్ట్రాలకు విస్తరించే అవకాశం ఉందని పేర్కొంది. రుతుపవనాలు సాధారణంగా కేరళలోకి జూన్ 1న ప్రవేశి స్తాయని, కానీ ఈసారి 8 రోజుల ముందే ప్రవేశించాయి. రుతుపవనాలతో పాటుగా అరేబియా సముద్రంలో ద్రోణి ప్రభావం.. బంగాళా ఖాతంలో అల్ప పీడనం కారణంగా రానున్న రెండు రోజుల్లో ఏపీలోని సీమ, కోస్తా జిల్లాల్లో కుండపోత వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఉత్తర బంగాళాఖాత ప్రాంతంలో ఈ నెల 27న అల్పపీడనము ఏర్పడే అవకాశం ఉంది. దీంతో, భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అప్రమత్తం చేస్తోంది.

రుతుపవనాలు.. అల్ప పీడనం కారణంగా రానున్న రెండు రోజుల్లో తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది. భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు, బలమైన ఈదురు గాలులు గంటకు 40 -50 కి.మీ. వేగంతో వీచే అవకాశం ఉంది. దక్షిణ కోస్తా ప్రాంతంలో ఉరుము లతో కూడిన మెరుపులు, బలమైన ఈదురు గాలులు గంటకు 40 -50 కి.మీ. వేగంతో వీచే అవకా శం ఉందని వెల్లడించారు. సోమ, మంగళవారం తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరు ములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముందని అప్రమత్తం చేసారు. భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. సీమ జిల్లాల్లోనూ భారీ వర్షాలు కురవనున్నాయి.












Click it and Unblock the Notifications