ఏపీ వాసులకు అలర్ట్ - రెండు రోజులు అప్రమత్తం..!!
ఏపీ వాసులకు వాతావరణ శాఖ కీలక సమాచారం వెల్లడించింది. బంగాళాఖాతంలో వచ్చేవారం ఏర్పడే వాయుగుండం బలపడి తుఫాన్ పైన తాజా ప్రకటన చేసింది. ఈ తుఫాన్ మధ్య బంగాళాఖాతం మీదుగా బంగ్లాదేశ్, మయన్మార్ తీరాల దిశగా వెళ్తుందని అంచనాకు వచ్చింది. దీంతో, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిసాకు తుఫాన్ ముప్పు లేనట్టేనని వాతావరణ నిపుణులు పేర్కొన్నారు. ఇక గురు, శుక్రవారాల్లో తెలంగాణలో ఉరుములు, మెరుపులు ఈదురుగాలులతో కూడిన వర్షం అక్కడక్కడ పడే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.

తుఫాన్ వస్తుందనే వార్తలతో తెలుగు రాష్ట్రాల్లో అలజడి మొదలైంది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఈనెల 6న ఉపరితల ఆవర్తనం, ఏడో తేదీన అల్పపీడనం ఏర్పడనుంది. ఆ మరుసటిరోజు వాయుగుండంగా, 9న ఆగ్నేయ బంగాళాఖాతంలో ఈనెల 6న ఉపరితల ఆవర్తనం, ఏడో తేదీన అల్పపీడనం ఏర్పడనుంది. ఆ మరుసటిరోజు వాయుగుండంగా, 9న తుఫాన్‌గా బలపడనుంది. అనంతరం ఉత్తర ఈశాన్యంగా పయనించి తూర్పు మధ్య బంగాళాఖాతంలోకి ప్రవేశించి పదో తేదీకల్లా తీవ్ర తుఫాన్‌గా మారుతుందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేసారు. అదే దిశగా పయనించి బంగ్లాదేశ్, మయన్మార్ దిశగా వెళ్లనుందన్నారు. 9న ఏర్పడనున్న తుఫాన్‌కు 'మోకా'గా పేర్కొన్నారు. ఇదే సమంలో ఈ రోజు, రేపు అక్కడక్కడ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది.

కొద్ది రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో అకాల వర్షాలు కురుస్తున్నాయి. వడగళ్లు, ఈదురుగాలులతో పంటలకు నష్టం జరిగింది. ఇప్పుడు తాజాగా మరో రెండు రోజులు వర్షాలు తప్పవని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీని ప్రభావం ఒడిశా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలపై తీవ్రంగా, మరికొన్ని రాష్ట్రాలపై సాధారణ ప్రభావం ఉంటుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని, తీర ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వెల్లడించింది. రెండు రాష్ట్ర ప్రభుత్వాలు అకాల వర్షాలు, పంట నష్టం, సహాయక చర్యలపైన అప్రమత్తం అయ్యాయి. అధికారులకు సూచనలు చేసాయి. రైతులకు భరోసా ఇచ్చాయి. తడిసిన ప్రతీ గింజ కొంటామని, రైతులకు అండగా ఉంటామని సీఎం కేసీఆర్ భరోసానిచ్చారు. అయితే, ఏపీలో ఇన్‌పుట్ సబ్సీడీ ఇచ్చే ఏర్పాటు చేయాలని ఏపీ సీఎం జగన్ అధికారులకు ఆదేశాలిచ్చారు.












Click it and Unblock the Notifications