భక్తులకు టీటీడీ కీలక సూచనలు..రెండ్రోజులు తుంబురు తీర్థ ముక్కోటి ఉత్సవాలు..
తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలనుకునే భక్తులకు టీటీడీ కీలక సూచనలు చేసింది. ఈ నెల 24, 25వ తేదీల్లో జరిగే శ్రీ తుంబురు తీర్థ ముక్కోటి ఉత్సవాల గురించి భక్తులకు తిరుమల ఆలయ అధికారులు పలు సూచనలు చేశారు. రెండురోజుల పాటు జరిగే ఈ ఉత్సవాలకు విశేష భక్త జనసందోహం హాజరవుతారు. వారి సౌకర్యార్థం భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా విసృత్త ఏర్పాట్లను చేసినట్లు ఆలయ అధికారులు పేర్కొన్నారు.
ఈ ఉత్సవ తీర్థానికి చాలా దూరం నడవాల్సి ఉంటుంది. కాబట్టి శ్వాస కోస సమస్యలు, ఉబకాయం, గుండె తదితర సమస్యలున్న వారు ఈ ఉత్సవానికి హాజరయ్యేందుకు వీలులేదని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు సూచించారు. ఈ నెల 24 వ తేదీ ఉదయం ఐదు గంటలనుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు ఈ ఉత్సవం ఉంటుంది. తిరిగి మరుసటి రోజు ఉదయం ఐదు గంటలకు మొదలయితే పదకొండుగంటలకు మాత్రమే భక్తులకు లోపలికి ప్రవేశం ఉంటుంది. ఈ తీర్థాలకు హాజరయ్యే భక్తులకు తాగునీటి సదుపాయాలను అల్పాహారం, అన్నప్రసాదాలను పాపవినాశనం డ్యామ్ వద్ద ఏర్పాటు చేశారు.

తీర్థముక్కోటీలో పాల్గొననున్న అధికారులు, భక్తులు : శ్రీ తుంబురు తీర్థ ముక్కోటి ఉత్సవాలు ఫాల్గుణ మాసంలో ఉత్తరఫల్గుణీ నక్షత్రంతో కూడిన పౌర్ణమినాడు నిర్వహిస్తారు. ఈ రోజున భక్తులు తీర్థస్నానమాచరించి, దానధర్మాలు చేసి స్వామివారిని దర్శించుకుంటారు. ఈ తుంబురు తీర్థ ముక్కోటిని దర్శించి, స్నానమాచరించడం భక్తులకు ఒక ప్రత్యేక అనుభూతిగా భావిస్తారు. ఇక, ఈ తీర్థ ముక్కోటిలో తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులతోపాటు అర్చకులు, పెద్ద సంఖ్యలో భక్తులు విచ్చేస్తారు. భక్తుల సౌకర్యార్థం ప్రథమ చికిత్స కేంద్రాలు, అంబులెన్సులు, మందులు, పారామెడికల్ సిబ్బంది అందుబాటులో ఉంచనున్నారు. భక్తులకు ఎలాంటి సమస్యలు తలెత్తకుండా అధికారులు పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టనున్నారు. పాపవినాశనం నుండి తుంబురు తీర్థం వరకు పోలీసుశాఖ, అటవీశాఖ, టీటీడీ విజిలెన్స్ విభాగానికి సంబంధించిన అధికారులు భక్తులకు నిత్యం అందుబాటులో ఉంటారు.
ఈ ఉత్సవాలకు వచ్చే భక్తలు వంట సామగ్రి, కర్పూరం, అగ్గిపెట్టెలు వంటివి తీసుకురాకూడదని టీటీడీ అధికారులు తెలిపారు.












Click it and Unblock the Notifications