ప్రయాణికులకు హెచ్చరిక: ఏపీలో ముఖ్యమైన రైళ్ల టైమింగ్స్ మార్పు

దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని ఆంధ్రప్రదేశ్ లో నడుస్తున్న కొన్ని ముఖ్యమైన రైళ్లకు సమయ వేళలను అధికారులు మార్పు చేశారు. ప్రతిరోజు తెల్లవారుజామున 5.15 గంటలకు బయలుదేరే మూర్ మార్కెట్ - సూళ్లూరు పేట మెమూ రైలు ఇకనుంచి తెల్లవారుజామున 5.40 గంటలకు బయలుదేరుతుంది. అలాగే ప్రతిరోజు ఉదయం 10.05 గంటలకు బయలుదేరే నెల్లూరు-సూళ్లూరు పేట మెమూ రైలు ఇకనుంచి 10.30 గంటలకు బయలుదేరుతుంది. ఈ రెండింటికితోడు మూర్ మార్కెట్ నుంచి గుమ్మడిపూండి వరకు నడిచే సబర్బన్ రైలు ప్రతిరోజు తెల్లవారుజామున 5.40 గంటలకు బయలుదేరుతుంది. ఇకనుంచి ప్రతిరోజు 5.20 గంటలకే బయలుదేరనుంది. ఈనెల 17వ తేదీ నుంచి వీటిని అమల్లోకి తెచ్చారు.

శబరిమలకు ప్రత్యేక రైళ్లు
అయ్యప్పస్వామి భక్తుల కోసం ఏపీ నుంచి శబరిమలకు ప్రత్యేక రైళ్లు నడుపుతున్నారు. విజయవాడ నుంచి కొల్లం వరకు డిసెంబరు 21, 28 తేదీల్లో 07177 రైలు శనివారం రాత్రి 10.05 గంటలకు విజయవాడ నుంచి బయలుదేరుతుంది. సోమవారం ఉదయం 6.20 గంటలకు కొల్లం చేరుకుంటుంది. అలాగే డిసెంబరు 23, 30 తేదీల్లో కొల్లం నుంచి విజయవాడ వరకు నడిచే ప్రత్యేక రైలు 07178 కొల్లంలో ఉదయం 10.45 గంటలకు బయలుదేరి తర్వాత రోజు రాత్రి 9.00 గంటలకు కాకినాడ వరకు నడుస్తుంది.

important trains timings changed in ap

నర్సాపురం నుంచి కొల్లం వరకు
నర్సాపురం నుంచి కొల్లం వరకు జనవరి 15, 22 తేదీల్లో 07183 ప్రత్యేక రైలు నర్సాపురంలో బుధవారం రాత్రి 9.00 గంటలకు బయలుదేరి శుక్రవారం తెల్లవారుజామున 5.30 గంలకు కొల్లం చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో జనవరి 17, 24 తేదీల్లో 07184 కొల్లంలో ఉదయం 8.40 గంటలకు బయలుదేరి శనివారం సాయంత్రం 6.30 గంటలకు నర్సాపూర్ వస్తుంది. అలాగే కుంభమేళాకు వెళ్లే భక్తుల కోసం ఏపీ మీదుగా అధికారులు ప్రత్యేక రైళ్లను నడుపుతున్నారు. మైసూరు-దానాపూర్, దానాపూర్-మైసూర్ 06207, 06208 రైళ్లు జనవరి 18, ఫిబ్రవరి 15, మార్చి 1, తిరుగు ప్రయాణంలో జనవరి 22, ఫిబ్రవరి 19, మార్చి5 తేదీల్లో నడుస్తాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+