Tiger: విద్యుత్ తీగ తగిలి చనిపోయిన పులి.. వండుకుని తిన్న స్థానికులు..!

ప్రకాశం జిల్లా పుల్లల చెరువు మండలం అక్కపాలెంలో కొందరు పులి మాంసాన్ని వండుకుని తిన్నారు.

మన చిన్నప్పుడు అన్నం తినకుంటే.. అమ్మ మనల్ని బెదిరించేది. అన్నం తినకుంటే పులి వచ్చి తినేస్తుందని భయపట్టేది. కానీ ఓ చోట మనుషులే పులిని తిన్నారు. అది ఇతర దేశాల్లో కాదు. మన దేశంలోనే, మన రాష్ట్రంలోనే. అయితే వారు పులిని కావాలని చంపి తినలేదు. విద్యుత్ కంచె తగిలి పులి చనిపోవడంతో దాని మాంసాన్ని గుట్టుచప్పుడు కాకుండా తినేశారు. ఈ ఘటన ప్రకాశం జిల్లా పుల్లల చెరువు మండలం అక్కపాలెం అటవీ ప్రాంతంలో జరిగింది.

ఫిబ్రవరి 10న ఎర్రగొండపాలెం ఫారెస్ట్ రేంజ్ అధికారి నీలకంఠేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో అటవీ సిబ్బంది ఫారెస్ట్ లో ఆడ పులి పాదముద్రలను గుర్తించారు. దాని కదలికలు గుర్తించేందుకు రోజు ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేశారు. అడవి చుట్టు పక్కల వారిని అలర్ట్ చేశారు. కానీ అప్పటికే ఆ పులి మాంసాన్ని కొందరు వండుకుని తినేసినట్లు తెలిసింది.

In Akkapalem, Pullala Cheruvu Mandal, Prakasam District, some people cooked and ate tiger meat

రైతులు అడవి పందులు, ఇతర జంతువుల నుంచి పంటలను కాపాడుకునేందుకు పొలం చుట్టూ రైతులు విద్యుత్ కంచె వేశారు. అటుగా వచ్చిన పులికి విద్యుత్ కంచె తగలడంతో అది మృతి చెందింది. ఉదయం వచ్చి చూసేసరికి పులి చనిపోయి కనిపించింది. ఈ విషయం తెలుసుకున్న కొందరు పులి చనిపోయిన విషయం బయటకు తెలిస్తే కేసు అవుతుందని.. ఆ పులి మాంసాన్ని వండుకుని తిన్నట్లు సమాచారం.

కొద్ది రోజుల తర్వాత పులి గోళ్ల విషయంలో వారి మధ్య గొడవ జరగడంతో అసలు విషయం బయటకొచ్చింది. దీనిపై అటవీ అధికారులు విచారణ చేపట్టారు. 12 మంది పులి మాంసం తిన్నట్లు గుర్తించినట్లు తెలుస్తోంది. అయితే పులి పుల్లలు తల్లి కోసం వెతుకుతున్నట్లు అటవీలో ఏర్పాటు చేసిన కెమెరాల్లో రికార్డు అయ్యాయి. చాలా దేశాల్లో మాంసాల కోసం వన్యమృగాల జోలికి వెళ్లడం చట్టవిరుద్ధం. అసలు వాటిని తినాలనే ఆలోచనే రాదు. కానీ లండనన్ కేంద్రంగా పనిచేసే ప్రిమేవల్ ఫుడ్స్ అనే సంస్థ.. జంతువుల జోలికి వెళ్లకుండా ల్యాబ్​లో వన్యమృగాల మాంసా
న్ని అభివృద్ధి చేస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+