వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జగన్ సర్కార్ మరో యూటర్న్ ? వీఆర్వోలకు సర్పంచ్ అధికారాల అప్పగింతపై-హైకోర్టుకు వెల్లడి

|
Google Oneindia TeluguNews

ఏపీలో వైసీపీ ప్రభుత్వం మరో యూటర్న్ తీసుకోబోతోంది . దూకుడుగా నిర్ణయాలు తీసుకోవడం, ఆ తర్వాత కోర్టుల్లో ఎదురుదెబ్బలు తగిలిన తర్వాత వాటిని వెనక్కి తీసుకుటున్న వైసీపీ సర్కార్....తాజాగా అలాంటిదే మరో నిర్ణయం తీసుకోనుంది. రాష్ట్రంలో సర్పంచ్ ల అధికారాల్ని వీఆర్వోలకు బదిలీ చేస్తూ గతంలో ఇచ్చిన జీవో నంబర్ 2ను ప్రభుత్వం వెనక్కి తీసుకునేందుకు సిద్ధమవుతోంది.

ఏపీలో గ్రామ సచివాలయాల ఏర్పాటు నేపథ్యంలో వాటిలో గ్రామ కార్యదర్శులుగా పనిచేస్తున్న వారికి గతంలో పంచాయతీ రాజ్ చట్టం కల్పించిన అధికారాల్ని వీఆర్వోలకు బదిలీ చేస్తూ వైసీపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు జీవో నంబర్ 2 విడుదల చేసింది. దీన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. అలాగేపంచాయతీ రాజ్ వ్యవస్ధకు సమాంతరంగా రెవెన్యూలో మరో వ్యవస్ధ ఏర్పాటు చేయడాన్ని హైకోర్టు కూడా తప్పుబట్టింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం జీవో నంబర్ 2ను వెనక్కి తీసుకునేందుకు ప్రభుత్వం సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది. అయితే ప్రభుత్వ స్దాయిలో ఇంకా నిర్ణయం తీసుకోకపోవడంతో త్వరలో దీనిపై సమాచారమిస్తామంటూ హైకోర్టుకు తెలిపింది.

in another u turn, jagan regime withdrawn g.o.no.2 on transfer of panchayat powers to revenue

Recommended Video

CM Jagan భారీ స్కెచ్.. AP Capital అభివృద్ధి కోసం 50 వేల కోట్ల రుణం! || Oneindia Telugu

గ్రామ సచివాలయంలో ప్రెసిడెంట్, పంచాయతీ సెక్రటరీల అధికారాలను వీఆర్వోలకు బదిలీ చేస్తూ గతంలో జీవో నెంబర్ 2ను తీసుకొచ్చిన ప్రభుత్వం.. హైకోర్టులో పిటిషన్, హైకోర్టు వ్యాఖ్యల నేపథ్యంలో దాన్ని వెనక్కితీసుకునే విషయంలో హైకోర్టకు సమాచారం ఇచ్చింది. దీంతో హైకోర్టు అదనపు పిటిషన్లపై విచారణను నిలిపేసింది. పంచాయతీ సెక్రటరీ అధికారాలను వీఆర్వోలకు బదిలీ చేయడం.. పంచాయతీ రాజ్ చట్టానికి విరుద్ధమని పిటిషనర్లు వాదించారు. దీంతో ప్రభుత్వం వెనక్కి తగ్గింది. అయితే హైకోర్టు ప్రభుత్వ అభిప్రాయం తెలుసుకున్నాక తదుపరి విచారణ ఈ నెల 20కి వాయిదా వేసింది.

English summary
ap government has withdrawn its order on transfer of sarpanches powers to vros.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X