ఏపీలో ఐదుచోట్ల రీ పోలింగ్ : తేదీలపై రాని క్లారిటీ
అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో రీ పోలింగ్ నిర్వహించే స్థానాలపై స్పష్టత వచ్చింది. మొత్తంగా 5 చోట్ల రీ పోలింగ్ నిర్వహిస్తామని కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది. అయితే ఎన్నికలు నిర్వహించే తేదీలను మాత్రం ఇంకా ప్రకటించలేదు.

ఇక్కడే రీ పోలింగ్
తొలివిడత సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఏపీలో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. టీడీపీ, వైసీపీ కార్యకర్తలు దాడితో గతంలో ఎన్నడూ లేనివిధంగా రాష్ట్రంలో ఎన్నికల వాతావరణం నెలకొంది. దీంతోపాటు సాంకేతిక లోపాల వల్ల చాలామంది ఓటర్లు తమ ఓటు వేయలేకపోయారు. గుంటూరు, నెల్లూరు జిల్లాలో రెండేసి చోట్ల, ప్రకాశం జిల్లాలో ఒక చోట రీ పోలింగ్ నిర్వహిస్తామని కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది. హింసాత్మక ఘటనలపై జిల్లా కలెక్టర్లు సీఈవో ద్వివేదికి నివేదించారు. ఆయన దానిని కేంద్ర ఎన్నికల సంఘానికి సిఫార్సు చేశారు. 5 చోట్ల రీ పోలింగ్ కేంద్ర ఎన్నికల సంఘం అనుమతించింది. తేదీలను ఈ అర్ధరాత్రి వరకు ప్రకటించే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications