వైసీపీ వర్సెస్ టీడీపీ : ఎమ్మిగనూరులో స్థల వివాదంలో గొడవ, 11 మందికి గాయాలు
ఎమ్మిగనూర్ : ఏపీలో టీడీపీ, వైసీపీ మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఏర్పడింది. ఎన్నికలు ముగిసి ఫలితాల కోసం వేచి చూస్తున్న తరుణంలో ఆడపా దడపా ఆ రెండు పార్టీ నేతల మధ్య గొడవలు జరగుతూనే ఉన్నాయి. గురువారం కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో టీడీపీ, వైసీపీ శ్రేణుల మధ్య ఘర్షణ జరిగింది.

పార్కింగ్ విషయంలో ...
ఎమ్మిగనూరు మండలంలోని మాస్ మాన్ దొడ్డిలో రహదారిపై టూ వీలర్ నిలిపిన ఘటన వైసీపీ, టీడీపీ మధ్య ఘర్షణకు దారితీసింది. వైసీపీ పార్టీకి చెందిన శ్రీరాములు తన ఇంటి ముందు టూ వీలర్ నిలిపాడు. ఈ స్థలం తనదని టీడీపీకి చెందిన మల్దకల్ శ్రీనివాసులు చెప్పాడు. వాహనం నిలుపొద్దని అభ్యంతరం వ్యక్తం చేయడంతో ఇరువర్గాల మధ్య గొడవకు కారణమైంది. మాటలతో మొదలైన గొడవ .. కర్రలు, రాళ్లతో దాడి చేసుకునేవరకు వెళ్లింది.
11 మందికి గాయాలు
ఈ దాడిలో టీడీపీకి చెందిన రామిరెడ్డి, మహేశ్, వెంకటేశ్, గోరంట్ల .. వైసీపీకి చెందిన మాధవస్వామి, చిన్నజయన్న, ఉరుకుందమ్మ, ధనుంజయ, ఉసేనమ్మ, ఉసేనప్ప, మల్దకల్ మొత్తం 11 మంది గాయపడ్డారు. వీరిని ఎమ్మిగనూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఇరువర్గాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు ఎస్సై రామసుబయ్య పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications