కోడెల పై దాడి కేసు : అంబటి పై ఎఫ్ఐఆర్ నమోదు : 35 మంది పైనా కేసు..!
స్పీకర్ కోడెల శివ ప్రసాద్ పై పోలింగ్ రోజు జరిగిన దాడి లో 35 మంది పై కేసు నమోదైంది. ఎన్నికల్లో భా గంగా ఇనిమెట్ల గ్రామంలో పోలింగ్ బూత్ లోకి వెళ్లిన కోడెల శివ ప్రసాద్ పై దాడి జరిగింది. ఆయన పై విచక్షణా రహితంగా దాడి చేయటం తో కేసు నమోదు చేసారు. ఇందులో ప్రధానంగా వైసిపి నేత అంబటి రాంబాబు పై ఎఫ్ఐఆర్ దాఖలు చేసారు.

అంబటి పై ఎఫ్ఐఆర్ నమోదు..
పోలింగ్ రోజున స్పీకర్ కోడెల శివ ప్రసాద్ పై జరిగిన దాడి లో 35 మంది పై కేసు నమోదైంది. సత్తెనపల్లి డీఎస్పీ ఈ కేసును పర్యవేక్షిస్తున్నారు. ఈ కేసులో వైసిపి నేతల పైనా ఎఫ్ఐఆర్ నమోదు చేసారు. వైసిపి నేత..సత్తెనపల్లి నుండి పోటీలో ఉన్న అభ్యర్ది అంబటి రాంబాబు తో పాటుగా రాజ నారాయణ పై ఈ కేసు నమోదు చేసారు. సిసి ఫుటేజ్ ఆధారంగా కోడెల పై దాడి చేసిన వారిని గుర్తించే పని లో పడ్డారు. 11వ తేదీ న పోలింగ్ నాడు స్పీకర్ కోడెల శివ ప్రసాద్ ఇనిమెట్ల లోని పోలింగ్ బూత్ వద్దకు వెళ్లారు. ఆయన అక్కడ ఉద్దేశ పూర్వకంగానే లోపలికి ప్రవేశించి తలుపులు వేసుకున్నారని..దీంతో..రిగ్గింగ్ చేస్తున్నారనే భావనతో అక్కడ ఉన్న స్థానికులు దాడి చేసారని వైసిపి నేతలు చెబుతున్నారు.
వైసిపి నేతల ప్రోత్సాహం తోనే...
అయితే, కోడెల శివ ప్రసాద్ మాత్రం తాను పోలింగ్ సరళి పరిశీలనలో భాగంగా ఇనిమెట్ల పోలింగ్ బూత్ వద్దకు వెళ్లానని చెప్పారు. ఆ సమయంలో అక్కడ ఉన్న వైసిపి నేతలు రెచ్చ గొట్టటం తో కార్యకర్తలు తన పై దాడి చేసి చొక్కా చించేసారని..కింద పడేసి కొట్టారని ఆవేదన వ్యక్తం చేసారు. ఆ సమయంలో తాను స్పృహ కోల్పోవటం తో పక్కనే ఉన్న కార్యకర్తలు తీసుకొచ్చారని వివరించారు. దీని పై వైసిపి నేత అంబ టి రాంబాబు సైతం స్పందించారు. తాను ఏనాడు దాడులు చేయలేదని..చేయించలేదని స్పష్టం చేసా రు. ఆ సంస్కృతి కోడెల కే ఉందన్నారు. కోడెల ఇంట్లో బాంబులు పేలిన ఘటనను గుర్తు చేసారు. తన పై ఉద్దేశ పూర్వకంగా కేసులు పెట్టి వేధిస్తే..న్యాయ పోరాటం చేస్తానని హెచ్చరించారు.












Click it and Unblock the Notifications