అనుమానం రేపిన కలహం : ఒంటిపై కిరోసిన్ పోసుకున్న ప్రేమికులు, ప్రియుడి పరిస్థితి విషమం

సంతమాగులూరు : ఔను వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు. అయితే ఇద్దరికీ ఇదివరకే పెళ్లి అయ్యింది. అయినా వివాహేతర సంబంధం కొనసాగింది. ఇంతలో ఏమైందో ఏమో కానీ ఆమెపై అతడికి అనుమానం వచ్చింది. తనతో సహజీవనం చేస్తోన్న వ్యక్తికి అనుమానం రావడాన్ని జీర్ణించుకోలేకపోయింది. కిరోసిన్ పోసుకోగా .. నేను కూడా అంటూ అతగాడు కూడా గ్యాస్ పోసుకున్నాడు. ఇంతలో ఇద్దరు కాంప్రమైజ్ అన్న ... అగ్గిరాజేసింది.

వివాహేతర సంబంధం ..

వివాహేతర సంబంధం ..

ప్రకాశం జిల్లా సంతమాగులూరు మండలం ఏల్చూరుకు చెందిన మామిడిల చెన్నయ్య అద్దంకి డిపోలో ఆర్టీసీ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. అతనికి పెళ్లైంది. భార్య, ముగ్గురు పిల్లు కూడా ఉన్నారు. వారిలో ఇద్దరు అమ్మాయిలుకు పెళ్లి కూడా అయ్యింది. కానీ చెన్నయ్య ఏల్చూరికే చెందిన పార్వత్రితో పరిచయం ఏర్పడింది. అయితే ఆమెకు కూడా ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే భర్తతో విడిపోయి ఆరేళ్ల క్రితం ఏల్చూరుకు వచ్చింది. వారి పరిచయం .. కాస్త వివాహేతర సంబంధానికి దారితీసింది. రోజూ పార్వతీ ఇంటికి వచ్చేపోయేవాడు చెన్నయ్య. అయితే ఇంతలో వారి మధ్య అనుమానం రేగి .. మంట పెట్టుకునేవరకు వెళ్లింది.

ఇంతలో అనుమానం

ఇంతలో అనుమానం

కొన్నాళ్ల నుంచి పార్వతీపై చెన్నయ్యకు అనుమానం కలిగింది. ఈ విషయంపై ఆమెను నిలదీయడంతో వారి సహజీవనంలో కలహాలు మొదలయ్యాయి. దీంతో కలత చెందిన పార్వతీ ప్రియుడు ఎదుటే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించింది. ఒంటిపై కిరోసిన్ పోసుకుంది. నువ్వులేని జీవితం తనకెందుకు అనుకున్నాడో ఏమో కానీ అతగాడు కూడా ఒంటిపై కిరోసిన్ పోసుకున్నాడు. తర్వాత కాసేపు మాట్లాడుకొని ఇద్దరూ రాజీపడ్డారు. అయితే అప్పటికే చెన్నయ్య మద్యం సేవించాడు. సిగరెట్ తాగే అలవాటు ఉంది. ఇంకేముంది నాలుక పీకడంతో .. సిగరెట్ వెలిగించేందకు అగ్గిపుల్ల గీకడంతో అప్పటికే ఉన్న కిరోసిన్‌కు అజ్యం పోసింది. దీంతో తీవ్రగాయాలైన చెన్నయ్య పరిస్థితి విషమంగా ఉండగా ... స్వల్పగాయాలతో పార్వతీ బయటపడింది.

పిల్లల పరిస్థితి ఏంటీ ?

పిల్లల పరిస్థితి ఏంటీ ?

వారిద్దరూ చేసే సహజీవనంలో చెలరేగిన కలహాలు .. రెండు కుటుంబాల్లో విషాదానికి దారితీసింది. విషమంగా ఉన్న చెన్నయ్య చనిపోతే .. ఆయన్నే నమ్ముకున్న భార్య, మరో కూతురు పరిస్థితి ఏంటి అనే విషయం మరచిపోయాడు. మరోవైపు ప్రియుడి మోజులో సహజీవనం చేసిన పార్వతీ .. తన పిల్లల భవిష్యత్ గురించి ఆలోచించాక పెద్ద తప్పే చేసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+