వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రేమించి పెళ్లి చేసుకుని ఇద్దరు పిల్లలు పుట్టాక వదిలేసిన భర్త: ఆపై అత్తారింటి దాడి

By Pratap
|
Google Oneindia TeluguNews

విజయనగరం‌: తనకు న్యాయం చేయాలని అత్తింటివారిని కోరేందుకు వచ్చిన మహిళపై ఆ కుటుంబసభ్యులు సామూహిక దాడి చేశారు. పిల్లలు ఉన్నప్పటికీ దౌర్జన్యం చేసి దుస్తులను సైతం చించి వేశారని, తనకు అండగా నిలబడేందుకు వచ్చిన వారిపై కూడా దౌర్జన్యం చేశారని బాధితురాలు, దళిత మహిళ రజని ఆవేదన వ్యక్తం చేసింది. దీనిపై ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు మీడియాలో వార్తలు వచ్చాయి.

కొమరాడ మండలం వనజ గ్రామానికి చెందిన చింతాడ రజని, అదే మండలం కోదులగుంపకు చెందిన పోల సోమేశ్వరరావు ప్రేమించుకుని కురుపాం సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో 2011లో కులాంతర వివాహం చేసుకున్నారు. వివాహం చేసుకున్న వెంటనే బతుకుతెరువు కోసం విశాఖపట్నం వెళ్లిపోయారు. 2014 మేలో వీరిద్దరికి రాహుల్‌ జన్మించారు. 2015లో సునంద పుట్టింది.

In-laws attack a woman in Vijayanagaram district

అప్పటి నుంచి భార్యాభర్తల మధ్య . సోమేశ్వరరావు రజనిని వదిలేసి స్వగ్రామానికి వచ్చేశాడు. దీంతో ఇద్దరి పిల్లలతో విశాఖలో జీవనం సాగించలేక రజని స్వగ్రామానికి చేరుకుంది. తల్లి కాంతమ్మ వద్ద ఉంటూ జీవనం సాగించేది. భర్త సోమేశ్వరరావు స్వగ్రామానికి వచ్చాడని తెలుసుకున్న రజని కొమరాడ పోలీసులను నిరుడు డిసెంబర్‌లో ఆశ్రయించింది. వీరికి కౌన్సెలింగ్‌ నిర్వహించి ఒక్కటి చేద్దామని పోలీసులు కేసు నమోదు చేయలేదు. అయితే కౌన్సెలింగ్‌ నిర్వహించినప్పటికి ఫలితం లేకుండాపోయింది.

దాంతో తనకు న్యాయం చేయాలని గురువారం అత్తవారింటికి వెళ్లిన రజనిపై భర్త, అతని కుటుంబసభ్యులు దౌర్జన్యంతో చేశారు. సిపిఎం నేతలు కొల్లి సాంబమూర్తి, రెడ్డి చిన్న సహకారంతో ఆమె పార్వతీపురం పట్టణ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసింది.రజనికి న్యాయం జరిగే వరకు తాము అండగా ఉంటామని సిపిఎం నేతలు చెప్పారు.

English summary
A Dalith woman in Vijayanagaram district alleged that her in-laws attacked her for demanding justice.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X