APSRTC ప్రైవేటీకరణపై తేల్చేసిన ఏపీ సర్కార్..! పీపీపీలో డిపోలు-3 వేల ఈవీలు..!

ఏపీలో ఆర్టీసీ (APSRTC) ప్రైవేటీకరణపై జరుగుతున్న రచ్చపై ప్రభుత్వం ఇవాళ క్లారిటీ ఇచ్చింది. అలాగే విద్యుత్ బస్సుల రాకతో జరగబోతున్న మార్పుల్ని కూడా వెల్లడించింది. గోదావరి పుష్కరాలతో పాటు స్త్రీశక్తి పథకానికీ విద్యుత్ బస్సుల్ని వాడబోతున్నట్లు మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. అలాగే ఆర్టీసీలో పీపీపీ విధానం ఎక్కడ అమలు చేయబోతున్నారో కూడా వివరించారు. ఆర్టీసీ అభివృద్ధిపై సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన ఉన్నతస్దాయి సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకున్నారు.

APSRTC ప్రైవేటీకరణపై తేల్చేసిన ఛైర్మన్ కొనకళ్ల..! టికెట్ రేట్ల పెంపుపై క్లారిటీ..!
APSRTC ప్రైవేటీకరణపై తేల్చేసిన ఛైర్మన్ కొనకళ్ల..! టికెట్ రేట్ల పెంపుపై క్లారిటీ..!

ఆర్టీసీ ఆధునీకరణకు ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు.
గత ఐదేళ్లలో దెబ్బతిన్న ఆర్టీసీని కూటమి ప్రభుత్వం గాడిలో పెట్టిందని, స్త్రీ శక్తి పథకం విజయవంతంగా ఏడాది పూర్తి చేసుకుందని ఆయన తెలిపారు. రాష్ట్రంలో దశలవారీగా ఈవీ బస్సుల విస్తరణకు కార్యాచరణ సిద్ధం చేశామన్నారు. తొలి దశలో 700 ఈవీ బస్సులు రెండు నెలల్లో అందుబాటులోకి రానున్నాయని మంత్రి వెల్లడించారు. జూలైలో 6 డిపోలలో ఈవీ బస్సుల నిర్వహణకు మౌలిక సదుపాయాలు సిద్ధం చేస్తామన్నారు.

AP Rules Out APSRTC Privatisation Eyes PPP Model for Depots and 3 000 New EV Buses
 ఒకే రోజులో రాజమండ్రి నుంచి అరకు వెళ్లిరండి-ఆర్టీసీ కొత్త బస్సు-టికెట్ ఇలా..!
ఒకే రోజులో రాజమండ్రి నుంచి అరకు వెళ్లిరండి-ఆర్టీసీ కొత్త బస్సు-టికెట్ ఇలా..!

మహావాస్ పథకం కింద 300 ఈవీ బస్సుల్ని కేటాయిస్తున్నామని, మరో 500 ఈవీ బస్సుల కొనుగోలు ప్రక్రియ పూర్తి చేశామని మంత్రి తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 3,000 ఈవీ బస్సుల ఏర్పాటే ప్రభుత్వ లక్ష్యమన్నారు. కాలుష్య నియంత్రణలో ఏపీని అగ్రస్థానంలో నిలపాలని సీఎం ఆదేశాలు ఇచ్చారన్నారు. భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు విజయవాడ నుంచి 40 ప్రత్యేక బస్సులు అందుబాటులోకి తెస్తామని, గోదావరి పుష్కరాలకు "గోదావరి" అనే పేరుతో ప్రత్యేక బస్సు సర్వీసులు నడుపుతామని తెలిపారు. అన్ని ఘాట్ల వద్ద పుష్కరాల ఏర్పాట్లు సిద్ధం చేశామన్నారు.

AP Rules Out APSRTC Privatisation Eyes PPP Model for Depots and 3 000 New EV Buses

రాబోయే రోజుల్లో పల్లెవెలుగు నుంచి ఎక్స్‌ప్రెస్ వరకు అన్ని విభాగాల్లో ఈవీ బస్సుల వినియోగం ఉంటుందన్నారు. స్త్రీ శక్తి పథకం ఆర్టీసీపై భారం కాదు బాధ్యత అన్నారు. ఆర్టీసీని ప్రైవేటీకరించే ఆలోచన ప్రభుత్వానికి లేదని, ఆర్టీసీకి ప్రజలకు మధ్య విడదీయరని అనుబంధం ఉందని గుర్తుచేశారు. పీపీపీ విధానంలో డిపోల ఆధునీకరణ చేపడతామన్నారు. ఆర్టీసీ కార్మికులకు ప్రభుత్వం పూర్తి అండగా ఉంటుందని, రెండేళ్లలో నైట్ అలవెన్స్ సహా ఉద్యోగుల పలు సమస్యల పరిష్కారం చేశామని తెలిపారు. 3000 కొత్త ఈవీ బస్సులతో ఆర్టీసీకి కొత్త రూపు రానుందన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+