తిరుమల భక్తులు షాక్, శ్రీనివాసం, మాధవంలో పైప్ లైన్లతో ఇబ్బందులు, వసతి గృహాలు
తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. గత కొన్ని కొన్ని రోజులుగా తిరుపతిలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా తిరుపతి లో బస చేస్తున్న శ్రీవారి భక్తులు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తిరుపతిలోని శ్రీనివాసం, మాధవం వసతి గృహాల్లో కొన్ని సమస్యలు తలెత్తడంతో శ్రీవారి భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
గత కొన్ని రోజులుగా తిరుపతి నగరంలో భారీగా వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. భారీ వర్షాల కారణంగా తిరుపతి నగరంలోని శ్రీనివాసం, మాధవం వసతి గృహాల్లో డ్రైనేజీలు పగిలిపోయి ఆ కలుషిత నీరు బయటకు వస్తుంది. డ్రైనేజీల సమీపంలోనే తాగునీరు పైపులైన్లు ఉండటంతో ఆ నీరు ఎక్కడ తాగునరులో ఆ కలుషితం అవుతుందోనని శ్రీవారి భక్తులు, టీటీడీ ఆధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఇదే సమయంలో ఈ ప్రాంతంలోని సమస్యలు పరిష్కరించాలని శ్రీవారి భక్తులు టీటీడీ అధికారులకు మనవి చేస్తున్నారు. తిరుమలలో వసతి గృహాలు చిక్కవని చాలామంది భక్తులు తిరుపతిలోని శ్రీనివాసం, మాధవం వసతి గృహాల్లో బస చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఇలాంటి సమయంలో ఈ వసతి గృహాల్లో సరైన సౌకర్యాలు కల్పించాలని తిరుమల భక్తులు టీటీడీ అధికారులకు మనవి చేశారు.
శ్రీనివాసం, మాధవం వసతి గృహాల సమస్యల విషయంపై టీటీడీ సిబ్బంది పై అధికారులకు సమాచారం ఇచ్చారు. వెంటనే ఈ ప్రాంతంలోని డ్రైనేజ్ లు, కాలువలు విస్తీర్ణం పెంచి మరోసారి ఇలాంటి సమస్యలు రాకుండా చూడాలని శ్రీవారి భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించాలని భక్తులు టీటీడీ అధికారులకు మనవి చేశారు. వర్షాకాలం కావడంతో డ్రైనేజ్ పైపులు పగిలిపోయి ఇలాంటి సమస్యలు ఎదురైనాయని అధికారులు అంటున్నారు.

విషయం తెలుసుకున్న టీటీడీ అధికారులు, ఇంజనీరింగ్ విభాగం అధికారులు, సిబ్బంది శ్రీనివాసం, మాధవం వసతి గృహాల దగ్గరికి చేరుకునే సమస్యల పరిష్కరించడానికి చర్యలు తీసుకుంటున్నారు. వర్షాకాలంలో మరోసారి ఇలాంటి సమస్యలు రాకుండా, శ్రీవారి భక్తులు ఇబ్బందులు ఎదుర్కోకుండా చర్యలు తీసుకుంటామని టీటీడీ అధికారులు శ్రీవారి భక్తులకి హామీ ఇచ్చారు. తిరుపతి బస్ స్టాండ్ సమీపంలోని శ్రీనివాసం, మాదం వసతి సముదాయాల్లో రోజు వేలాది కుటుంబాలు బస చేస్తున్నాయి.












Click it and Unblock the Notifications