వైశ్యులతో తగవుకోసం కాదు, ఏపీని పాలిస్తోంది అంబానీయా: బెజవాడలో ఐలయ్య టెన్షన్

Posted By:
Subscribe to Oneindia Telugu

విజయవాడ/అమరావతి: విజయవాడలో కంచ ఐలయ్య ఆధ్వర్యంలో జేఏసీ నేతలు విజయవాడలో సభ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

చదవండి: మీకు ఉన్నట్లే మాకూ ఉంది, అమెరికాకు మొరపెట్టుకుంటావా, కొట్టడమే వృథా: కంచ ఐలయ్యపై టిజి

అయితే ఈ సభను అడ్డుకుంటామని వైశ్య, బ్రాహ్మణ, ఇతర కుల సంఘాలు చెబుతున్నాయి. ఐలయ్య విజయవాడకు వస్తే అడ్డుకుంటామని చెప్పారు.

చదవండి: బాధపడుతున్నారుగా: ఐలయ్య పుస్తకంపై జేపీ, 'ఆ కుట్రలో భాగంగానే పుస్తకాలు'

విజయవాడలో సభ వైశ్యులతో తగవు కోసం కాదు

విజయవాడలో సభ వైశ్యులతో తగవు కోసం కాదు

ఏపీలో తాను నిర్వహించే సభను కొన్ని కులాలు అడ్డుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నాయని కంచ ఐలయ్య ఆరోపించారు. కోమటోళ్లపై తాను రాసిన పుస్తకం సమస్య తీరిపోయిందని, ఈ సభ ఆర్యవైశ్యులతో తగవు కోసం కాదని స్పష్టం చేశారు. అయితే తమపై రాసిన పుస్తకంపై క్షమాపణ చెప్పకుండా, ఏమాత్రం స్పందించకుండా మరో అంశంపై వస్తున్నామంటే ఊరుకునేది లేదని వైశ్య సంఘాలు చెబుతున్నాయి.

ఏపీని పాలించేది చంద్రబాబా, అంబానీయా

ఏపీని పాలించేది చంద్రబాబా, అంబానీయా

ప్రయివేటు రంగంలో రిజర్వేషన్ల అంశంపై మాత్రమే సభ నిర్వహిస్తున్నట్లు కంచ ఐలయ్య చెప్పారు. ఏపీని పరిపాలించేది చంద్రబాబా లేక అంబానీయా అని నిలదీశారు. ముఖేశ్‌ అంబానీ ఏర్పాటు చేసే ఆయిల్‌ కంపెనీలో రిజర్వేషన్లు అమలు చేయాలని సభను నిర్వహించ తలపెట్టామని, అందుకు ప్రభుత్వం ముందుగా అనుమతి ఇచ్చి ఇప్పుడు నిరాకరించినట్లు చెబుతోందన్నారు.

నన్ను అరెస్ట్ చేస్తే

నన్ను అరెస్ట్ చేస్తే

తనను అరెస్ట్‌ చేస్తే ఆంధ్రప్రదేశ్‌లో భావ ప్రకటనా స్వేచ్ఛ లేదన్న విషయం ప్రపంచమంతా తెలుస్తుందని కంచ ఐలయ్య అన్నారు. సభకు మరో రోజు అనుమతి ఇచ్చినా తమకు అభ్యంతరం లేదని చెప్పారు. తాను ఎట్టి పరిస్థితుల్లో విజయవాడకు వెళ్తానని చెప్పారు.

కచ్చితంగా అడ్డుకుంటాం

కచ్చితంగా అడ్డుకుంటాం

ఐలయ్య విజయవాడకు వస్తే కచ్చితంగా అడ్డుకుంటామని ఆర్య వైశ్య, బ్రాహ్మణ, ఇతర కుల సంఘ నేతలు చెప్పారు. తాము చట్టబద్దంగా ముందుకు పోతామన్నారు. చట్టాన్ని గౌరవిస్తామని చెప్పారు. కానీ వారు దాడులు చెబితే మాత్రం తాము అలాగే ఎదురుదాడి చేస్తామన్నారు.

వారి ఆశయాలు నీరుగార్చుతున్నారు

వారి ఆశయాలు నీరుగార్చుతున్నారు

ఐలయ్య అంబేడ్కర్, పూలే ఆశయాలను ఐలయ్య నీరుగార్చుతున్నారన్నారు. పార్టీ సభకు అనుమతి కోరిన ఐలయ్య ఆత్మీయ సభ ఎలా పెడతారని ప్రశ్నించారు. కళ్యాణ మండపంలో తాము పెట్టుకునే సభకు అనుమతివ్వాలని వారు డిమాండ్ చేశారు. కాగా, ఐలయ్య సభకు, అటు వైశ్య సభలకు పోలీసులు అనుమతి నిరాకరించారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
The Gymkhana Grounds in Vijayawada has become the latest battleground in the controversy over writer and social scientist Kancha Ilaiah’s book Samaajika Smugglerlu Komatollu.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి