వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మీకు ఉన్నట్లే మాకూ ఉంది, అమెరికాకు మొరపెట్టుకుంటావా, కొట్టడమే వృథా: కంచ ఐలయ్యపై టిజి

ప్రముఖ రచయిత కంచ ఐలయ్య పైన తెలుగుదేశం పార్టీ నేత, రాజ్యసభ సభ్యులు టిజి వెంకటేష్ మరోసారి మండిపడ్డారు. కంచ ఐలయ్యకు కులాలను విమర్శించడం పరిపాటిగా మారిందని ఆగ్రహించారు.

|
Google Oneindia TeluguNews

కర్నూలు: ప్రముఖ రచయిత కంచ ఐలయ్య పైన తెలుగుదేశం పార్టీ నేత, రాజ్యసభ సభ్యులు టిజి వెంకటేష్ మరోసారి మండిపడ్డారు. కంచ ఐలయ్యకు కులాలను విమర్శించడం పరిపాటిగా మారిందని ఆగ్రహించారు. ఆయనను ఉరితీయాలన్న వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నానని, అలాగే ఆయన కూడా పుస్తకాన్ని వెనక్కి తీసుకోవాలన్నారు. పిచ్చిపట్టి పుస్తకాలు రాస్తానంటే ఊరుకోమన్నారు.

నిషేధించలేం కానీ: కోమట్లు పుస్తకంపై సుప్రీం కీలక వ్యాఖ్యలు, కంచ ఐలయ్యకు ఊరట, స్పందననిషేధించలేం కానీ: కోమట్లు పుస్తకంపై సుప్రీం కీలక వ్యాఖ్యలు, కంచ ఐలయ్యకు ఊరట, స్పందన

 మీరు ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే, మాకు ఆ హక్కు

మీరు ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే, మాకు ఆ హక్కు

రచయితగా తనకు ఇష్టం వచ్చినట్లు మాట్లాడే హక్కు ఉందని చెబుతున్నారని, ప్రజలకు సైతం తమ ఇష్టానుసారం మాట్లాడే వాక్ స్వాతంత్ర్యం ఉందన్నారు. బంగ్లాదేశ్‌, బ్రిటన్‌ రచయితల వివాదాస్పద పుస్తకాలను గతంలో నిషేధించారని, కంచ ఐలయ్య పుస్తకాన్నీ నిషేధించాలని డిమాండ్‌ చేశారు.

 అమెరికా సెనేటర్‌కు మొరపెట్టుకోవడమా

అమెరికా సెనేటర్‌కు మొరపెట్టుకోవడమా

మన దేశంలో కులమతాలకు ఆతీతమైన గొప్ప దేశమని, ఇలాంటి దేశంలో ప్రాణరక్ష లేదన్నట్లు కంచ ఐలయ్య అమెరికా సెనేటరుకు మొరపెట్టుకోవటం విడ్డూరంగా ఉందన్నారు. సంస్కృతి, సంప్రదాయాలు, మంచి, మర్యాదలను ఆమెరికన్లు మనల్ని చూసి నేర్చుకోవాలని, కావాలంటే సెనేటరును వచ్చి ఇక్కడి పద్ధతిని చూసి వెళ్లమనాలని టిజి అన్నారు.

Recommended Video

TDP MP TG Venkatesh And Maganti Babu Warned Writer Kancha Ilaiah | Oneindia Telugu
 అలా జరుగుతుందనే ఊరితీసే చట్టం తేవాలన్నాం

అలా జరుగుతుందనే ఊరితీసే చట్టం తేవాలన్నాం

కంచ ఐలయ్య రచనలతో కొన్ని లక్షలమంది మనోభావాలు దెబ్బతిని, వేలమంది కొట్టుకుచస్తారన్న బాధతోనే చట్టంలో మార్పులు వేసి ఐలయ్యను ఉరి తీయాలని చెప్పామే తప్ప తమకు మరే ఉద్దేశం లేదని టిజి వెంకటేష్ అన్నారు.

 ఆయనను కొట్టడమే వృథా, ఇంకా చంపడమా

ఆయనను కొట్టడమే వృథా, ఇంకా చంపడమా

కంచ ఐలయ్యను కొట్టటం వృథా అని, అలా కొట్టడం పద్ధతి కూడా కాదని, అలాంటిది ఆయనను చంపుతామనటం వాస్తవం కాదని టిజి వెంకటేష్ స్పష్టం చేశారు. కంచ ఐలయ్య తన వివాదాస్పద రచనలను ఉపసంహరించుకుంటే తాము కూడా తమ వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటామన్నారు.

పిచ్చిపట్టి రచనలు చేస్తున్నానని చెప్పారు

పిచ్చిపట్టి రచనలు చేస్తున్నానని చెప్పారు

కంచ ఐలయ్యకు పిచ్చి పట్టి ఇలాంటి రచనలు చేశానని స్వయంగా ఒప్పుకున్నారని టిజి వెంకటేష్ ఎద్దేవా చేశారు. అలాగైతే ఆయన పిచ్చాసుపత్రిలో ఉండటమే సబబు అన్నారు. ఇష్టం వచ్చినప్పుడు ఐలయ్య బయటకు వస్తారని, లేకుంటే గృహ నిర్బంధం అంటారన్నారు. లేకుంటే బర్త్‌డే పార్టీలు చేసుకుని డ్యాన్సులు చేస్తారని ఎద్దేవా చేశారు.

 సమస్య కొలిక్కి రావాలని కోరుకుంటున్నాం

సమస్య కొలిక్కి రావాలని కోరుకుంటున్నాం

కంచ ఐలయ్య క్షమాపణ చెప్పటంతోపాటు తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని టిజి వెంకటేష్ డిమాండు చేశారు. ఈ అంశంపై చర్చలు జరుగుతున్నాయని, సమస్య కొలిక్కి రావాలని కోరుకుంటున్నట్లు చెప్పారు.

English summary
Telugu Desam Party leader and Rajya Sabha MP TG Venkatesh fired at writer Kancha Ilaiah again. He demanded for his apology.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X