India T20I Captain: సూర్యపై వేటు ఫిక్స్..! టీమిండియా కొత్త కెప్టెన్ అతనే..!

భారత్ కు మహేంద్ర సింగ్ ధోనీ, రోహిత్ శర్మ తర్వాత టీ20 వరల్డ్ కప్ అందించిన మూడో కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ (India T20I Captain ) ఇప్పుడు గడ్డు కాలం ఎదుర్కొంటున్నాడు. ఈ ఏడాది భారత్ కు వరల్డ్ కప్ విజయం అందించినప్పటికీ అందులో సూర్య ప్రదర్శన దారుణంగా ఉంది. ఆ తర్వాత ఐపీఎల్ లోనూ అదే పరిస్ధితి. దీంతో సూర్యను తప్పించక తప్పని పరిస్ధితి సెలెక్టర్లకు ఎదురైంది. దీంతో సూర్య కుమార్ యాదవ్ (SuryaKumar Yadav) పై వేటుకు రంగం సిద్దం చేశారు. అలాగే అతని స్ధానంలో కొత్త కెప్టెన్ ను కూడా ఖరారు చేశారు.

భారత టీ20 జట్టు కొత్త కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ (Shreyas Ayyar) నియమితులయ్యే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి. ఐర్లాండ్, ఇంగ్లాండ్‌తో సిరీస్‌లకు అయ్యర్ కెప్టెన్సీ వహిస్తాడని సమాచారం. దీంతో సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీ శకానికి ముగింపు పడినట్లే. జట్టు దీర్ఘకాలిక నాయకత్వ అవసరాలను దృష్టిలో ఉంచుకుని సెలెక్టర్లు ఈ దిశగా అడుగులేస్తున్నారు. అయితే కెప్టెన్సీ రేసులో మరో ఇద్దరు బ్యాట్స్ మెన్ ఇషాన్ కిషన్, తిలక్ వర్మ కూడా ఉన్నారు.

India T20I Captain Change Suryakumar Yadav Set to Be Replaced Shreyas Iyer Among Three Contenders

గత మార్చిలో టీ20 ప్రపంచకప్‌ గెలిపించినా, బ్యాటింగ్‌లో నిలకడ కోల్పోయిన సూర్యకుమార్.. ఐపీఎల్ 2026లో ముంబై తరపున 13 మ్యాచ్‌లలో 270 రన్స్‌ మాత్రమే చేసి నిరాశపరిచాడు. దీంతో టీమ్ పాయింట్స్ టేబుల్లో తొమ్మిదో స్థానంలో నిలిచింది. సూర్యకుమార్ భవిష్యత్తుపై తుది నిర్ణయానికి ముందు కోచ్ గౌతమ్ గంభీర్‌ను బీసీసీఐ సంప్రదించనుంది. అయితే, ఈ మార్పును ఆలస్యం చేయడం కూడా అసాధ్యంగా తెలుస్తోంది. సెలెక్టర్లు తదుపరి రెండు టీ20 ప్రపంచకప్‌లకు నాయకత్వం వహించగల దీర్ఘకాలిక కెప్టెన్ కోసం చూస్తున్నారు. ఈ రేసులో శ్రేయాస్ అయ్యర్ అనుభవం, ఐపీఎల్ ప్రదర్శన అతనికి అదనపు బలం కానుంది. మరోవైపు తిలక్ వర్మ, ఇషాన్ కిషన్ 'డార్క్ హార్సెస్'గా కొనసాగుతున్నారు. అయ్యర్ కెప్టెనైతే, వీరిలో ఒకరు టీ20 వైస్ కెప్టెన్‌గా ఉంటారు. మరోవైపు 15 ఏళ్ల యువ బ్యాట్స్‌మెన్ వైభవ్ సూర్యవంశీ టీమిండియాలోకి ప్రవేశించే అవకాశాలున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+