ప్రపంచ్ కప్ తో సూర్య టీం ముందుగా అక్కడికే, వెంట పెట్టుకొని వెళ్లిన జైషా..!!
టీ0 ప్రపంచ కప్ లో భారత్ విజేతగా నిలిచింది. వరుసగా రెండో సారి... ప్రపంచ కప్ మూడు సార్లు గెలిచిన టీం గా రికార్డు నెలకొల్పింది. ఫైనల్స్ లో బలమైన న్యూజీలాండ్ పైన గెలుపు సాధ్యమేనా అనే సందేహాల నడుమ ఏకపక్షంగా విజయం సాధించింది. హిస్టరీ రిపీట్.. హిస్టరీ డిలీట్ అనే విధంగా ప్రపంచ చాంపియన్ అయింది. కాగా, విజేతగా ట్రోఫి అందుకున్న సూర్య టీం ను ఐసీసీ ఛైర్మన్ జైషా తొలి దర్శనం కోసం అహ్మదాబాద్ లో దగ్గర ఉండి తీసుకెళ్లారు.
టీం ఇండియా కొత్త చరిత్ర లిఖించింది. టీ20 ప్రపంచ కప్ లో అద్బుతమైన విజయం సాధించింది. అన్ని రంగాల్లో కివీస్ పైన పై చేయి సాధించి ఏకపక్షంగా విజయం నమోదు చేసింది. సూర్య కుమార్ యాదవ్ భారత్ కు మూడో కప్ అందించిన కెప్టెన్ గా నిలిచారు. ఫైనల్ లో టీం ఇండియాకు మద్దతుగా అనేక మంది ప్రముఖులు స్టేడియం కు తరలి వచ్చారు. లక్షా ఇరవై వేల మంది అభిమానుల నడుమ టీం ఇండియా విశ్వ విజేతగా నిలిచింది.

దేశ వ్యాప్తంగా సంబరాలు జరిగాయి. టీంలో ఓపెనింగ్ బ్యాటర్ల నుంచి బౌలర్ల వరకు అందరూ గెలుపే లక్ష్యంగా ఆడారు. ఎక్కడా కివీస్ ను కోలుకునే అవకాశం ఇవ్వలేదు. బూమ్రా మరోసారి తాను ఏంటో ఫైనల్స్ లో నిరూపించుకున్నాడు. ఈ మ్యాచ్ చూసేందుకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా.. ఐసీసీ ఛైర్మన్ జై షా స్వయంగా వచ్చారు. మ్యాచ్ అయ్యే వరకు జై షా పూర్తిగా అక్కడే ఉన్నారు.
వెంట బెట్టుకొని వెళ్లిన జైషా
ఇక, టీం ఇండియా ఛాంపియన్ గా గెలిచిన తరువాత కప్ అందుకునే వేళ టీం సభ్యులు ఫుల్ ఎంజాయ్ చేసారు. టీం ఇండియాలో సభ్యులుగా ఉన్నందుకు యువ కెరటాలు సంతోషంలో మునిగిపోయాయి. ఇక.. కప్ అందుకున్న తరువాత టీం కోచ్ గంభీర్.. కెప్టెన్ సూర్య కుమార్ ను తీసుకొని జైషా కప్ తో సహా అహ్మదాబాద్ లోని చారిత్రాత్మక హనుమాన్ మందిరానికి వెళ్లారు. అక్కడ ప్రత్యేక పూజలు చేయించారు.
~Suryakumar Yadav, Gautam Gambhir and Jay Shah visiting the Hanuman Temple with the T20 World Cup trophy after India’s historic victory. ❤️🙏
— BRAINLESS 🧠 (@Brainless629009) March 8, 2026
~A moment of gratitude and celebration after bringing the trophy home. 🏆🇮🇳#IndianCricketTeam #T20WorldCup2026Final #Champions pic.twitter.com/SySRrJrSfh
టీం ను జై షా వెంటపెట్టుకొని వెళ్లటం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కప్ ను హనుమాన్ ముందు ఉంచి ప్రత్యేక పూజలు చేసారు. ఈ విజయం లో భాగస్వాములైన ప్రతీ టీం సభ్యుడిని ప్రధాని సహా ప్రముఖులు అందరూ ప్రశంసలతో ముంచెత్తారు. కాగా.. ఈ చిరస్మరణీయ విజయం వేళ రిటైర్మెంట్ పైన వస్తున్న వార్తల పైన స్పందించిన కెప్టెన్ సూర్య ప్రస్తుతం అలాంటి ఆలోచన లేదని స్పష్టం చేసారు.
-
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్‌చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ -
రామ్ చరణ్ బర్త్‌డే గిఫ్ట్ మామూలుగా లేదుగా! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
100 ఏళ్ల రికార్డును తుడిచేస్తున్న గోల్డ్ క్రాష్.. బిట్‌కాయిన్ జేత్రయాత్ర! -
యుద్ధానికి 10 రోజులు బ్రేక్: ట్రంప్ సంచలన నిర్ణయం!












Click it and Unblock the Notifications