తెలంగాణ జనసేన లో చేరికలు మొదలు, మారుతున్న లెక్కలు..!!

తెలంగాణలో ఇప్పుడు జనసేనాని పవన్ చుట్టూ రాజకీయం నడుస్తోంది. తాజాగా పవన్ లక్ష్యంగా చేసిన వ్యాఖ్యలు... పవన్ రియాక్షన్ తో కొత్త లెక్కలు మొదలయ్యాయి. తెలంగాణలో ఎన్నికల్లో తాము పోటీ చేస్తామని పవన్ ప్రకటించారు. ఈ మేరకు పార్టీ బలోపేతం దిశగా చర్యలు ఉంటాయని స్పష్టం చేసారు. దీంతో.. ఈ వివాదం కొనసాగుతున్న సమయంలోనే తెలంగాణ జనసేనలో చేరిక లు మొదలయ్యాయి. దీంతో.. ఇప్పుడు పవన్ వ్యూహాలు ఏంటనే చర్చ మొదలైంది.

తెలంగాణలో జనసేనాని పవన్ తాజా నిర్ణయాలు ఆసక్తి కరంగా మారుతున్నాయి. తాజాగా జనసేన లో ప్రజారోగ్య మాజీ సంచాలకుడు డాక్టర్‌ గడల శ్రీనివాసరావు చేరారు. పవన్‌ కల్యాణ్‌ నివాసంలో ఆయన జనసేనలో చేరారు. గడలకు పార్టీ కండువా కప్పి జనసేనలోకి ఆహ్వానించిన పవన్‌.. డాక్టర్‌ గడల కుటుంబంతో తమ కుటుంబానికి ఎంతోకాలంగా అనుబంధం ఉందన్నారు. అంకితభావం, నిజాయతీ కలిగిన అధికారిగా డాక్టర్‌ గడల ప్రజల్లో పేరు సంపాదించుకున్నారని చెప్పారు.

Gadala Srinivasa rao joins in Janasena amid latest political developments leads to new equations

ప్రభుత్వ వైద్యుడిగా ప్రారంభమైన ప్రస్థానం ప్రజారోగ్య శాఖ సంచాలకుడి స్థాయికి చేరుకోవడం ఆయన కృషి, నిబద్ధతకు నిదర్శనమని పవన్‌ తెలిపారు. ముఖ్యంగా కొవిడ్‌ మహమ్మారి సమయంలో గడల అందించిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. డాక్టర్‌ గడల వంటి అనుభవజ్ఞులు, సే వాభావం కలిగిన వ్యక్తులు జనసేనలో చేరడం పార్టీకి మరింత బలాన్ని, విశ్వసనీయతను తీసుకొస్తుందని తెలిపారు.

షర్మిల కు రాజ్యసభ సీటు ఖరారు వేళ బిగ్ ట్విస్ట్, ఆయన ఎంట్రీతో..!!
షర్మిల కు రాజ్యసభ సీటు ఖరారు వేళ బిగ్ ట్విస్ట్, ఆయన ఎంట్రీతో..!!

జనసేన కొత్త వ్యూహాలు.. పవన్ సమావేశం

కాగా, తెలంగాణలో పార్టీని బలోపేతం చేయడంలో ఆయన కీలక పాత్ర పోషిస్తారని పవన్‌ ఆశాభావం వ్యక్తం చేశారు. పవన్‌తో తన అనుబంధం చిరంజీవి ద్వారా ప్రారంభమైందని డాక్టర్ గడల చెప్పుకొచ్చారు. పవన్ లోని నిజాయితీ.. ప్రజా సమస్యల పట్ల నిబద్ధత తనను ప్రభావితం చేశాయని చెప్పారు. తాను జనసేనలో చేరడం భావోద్వేగపూరిత నిర్ణయంకాదని, సమాజానికి మరిం త సేవ చేయాలన్న సంకల్పంతో తీసుకున్న నిర్ణయమన్నారు.

ప్రస్తుత తరానికి విలువలతో కూడిన రాజకీయాలు అవసరమని, ఆ లక్ష్యంతో పనిచేస్తున్న జనసే న తనకు సరైన వేదికగా భావించానని తెలిపారు. ఇక పై జనసైనికుడిగా పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసు కెళ్లడమే కాకుండా, తెలంగాణలో పార్టీ బలోపేతానికి కృషిచేస్తానన్నారు. ప్రజల ఆశీస్సులు, సహకారం తన కు ఎల్లప్పుడూ మార్గదర్శకంగా ఉంటాయని తెలిపారు. కాగా.. త్వరలోనే పార్టీ శ్రేణులతో సమావేశం కావాలని పవన్ నిర్ణయించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+