బాధపడుతున్నారుగా: ఐలయ్య పుస్తకంపై జేపీ, 'ఆ కుట్రలో భాగంగానే పుస్తకాలు'

Posted By:
Subscribe to Oneindia Telugu

విజయనగరం: వివాదాస్పద రచయిత కంచ ఐలయ్య రాసిన కోమటోళ్లు సామాజిక స్మగ్లర్లు పుస్తకంపై లోక్‍‌సత్తా వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ జయప్రకాశ్ నారాయణ స్పందించారు. కంచ ఐలయ్య అలా రాయడం సరికాదన్నారు.

'కంచ ఐలయ్య మూర్ఖుడు, కోర్టుకు వెళ్తాం, అందుకే కేసీఆర్ సైలెన్స్'

 వారు బాధపడుతున్నారుగా

వారు బాధపడుతున్నారుగా

విజయనగరం జిల్లా బొబ్బిలిలో విలేకర్లతో మాట్లాడారు. కులమతాల పేరుతో ఎవరినీ కించపరచేలా రాతలు ఉండకూడదని జేపీ అన్నారు. ఐలయ్య పుస్తకం బాధాకరం అన్నారు. ఐలయ్య రాసిన పుస్తకం సంబంధిత వర్గాలకు బాధని కలిగించేలా ఉందని, అలాంటి రాతలు సరికావన్నారు.

 హిందూ సమాజాన్ని విచ్ఛిన్నం చేసే కుట్ర

హిందూ సమాజాన్ని విచ్ఛిన్నం చేసే కుట్ర

హిందూ సమాజాన్ని విచ్ఛిన్నం చేసేందుకు అంతర్జాతీయంగా కుట్ర జరుగుతోందని హిందూ దేవాలయ పరిరక్షణ సమితికి చెందిన స్వామి కమలానంద భారతి వేరుగా అన్నారు. కోమటోళ్లు సామాజిక స్మగ్లర్లు పేరిట ప్రొఫెసర్‌ కంచ ఐలయ్య పుస్తకం రాయడంపై వైశ్యులు అనేక ఆందోళనలు చేస్తున్న విషయం తెలిసిందే.

 ఆ కుట్రలో భాగమే కంచ ఐలయ్య రచనలు

ఆ కుట్రలో భాగమే కంచ ఐలయ్య రచనలు

బుధవారం కాకినాడలో విశ్వ ధర్మ పరిరక్షణా వేదిక ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయి సభ నిర్వహించారు. ఆర్య వైశ్య సంఘాల ప్రతినిధులు, పలువురు పీఠాదిపతు లు హాజరయ్యారు. ఈ సందర్భంగా కమలానంద భారతిస్వామి మాట్లాడారు. అంతర్జాతీయంగా పలు దేశాలు హిందూ మతాన్ని విచ్ఛిన్నం చేసే కుట్రలో భాగం గానే క్రైస్తవ మతానికి చెందిన ఐలయ్య రచనలు సాగిస్తున్నారని ఆరోపించారు.

 మోడీ, రాజ్ నాథ్ స్పందించాలి

మోడీ, రాజ్ నాథ్ స్పందించాలి

కేంద్రం కఠిన చర్యలు తీసుకోకపోతే హిందూమతం ఇబ్బందుల్లో పడే ప్రమాదం ఉందని, ప్రధాని మోడీ, కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ దీనిపై దృష్టి కేంద్రీకరించాలని స్వామి సూచించారు.

 ఐలయ్య కంచరగాడి, దేశద్రోహి, జైల్లో పెట్టాలి

ఐలయ్య కంచరగాడి, దేశద్రోహి, జైల్లో పెట్టాలి

విశ్వ ధర్మ పరిరక్షణ వేదిక అధ్యక్షుడు శివస్వామి మాట్లాడుతూ.. ఐలయ్య కంచర గాడిదలాంటివారన్నారు. అలాంటి దేశ ద్రోహులను జైల్లో పెట్టాలన్నారు. వేదిక ఇంచార్జ్ శ్రీనివాసానంద స్వామి మాట్లాడుతూ.. కేరళ వంటి రాష్ట్రా ల్లో హిందువుల హత్యలు జరుగుతున్నాయని, ఆ సంఘటనలపై పుస్తకా లు ఎందుకు రాయరని ప్రశ్నించారు. ఇలాంటి దుష్ట శక్తులను తరిమికొట్టేందుకు హిందువులంతా ఐక్యంగా పోరాడాలన్నారు.

 వారికి రాయితీలు, హిందువులకు ఏవి

వారికి రాయితీలు, హిందువులకు ఏవి

అమర్‌నాథ్‌, కాశీ వంటి పుణ్యక్షేత్రాల సందర్శనకు పాలక ప్రభుత్వాలు ఎలాంటి రాయితీలు ఇవ్వడం లేదని, అదే ముస్లింలు, క్రైస్తవుల హజ్‌, జెరూసలెం యాత్రలకు రాయితీలు ప్రకటిస్తున్నారని స్వాములు విమర్శించారు. సభ అనంతరం స్వామీజీలు, ప్రతినిధులు కాకినాడ కలెక్టరేట్‌ వరకు ప్రదర్శన నిర్వహించారు. కలెక్టరేట్‌ వద్ద ధర్నా చేపట్టి.. ఐలయ్య అరెస్టుకు డిమాండ్‌ చేశారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Lok Satta chief Jayaprakash Narayana on Wednesday responded on writer Kancha Ilaiah's book. He condemned that book.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి