Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

రిలయన్స్ ఇండస్ట్రీస్ బంపర్ ఆఫర్ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్

దేశీయ పారిశ్రామిక దిగ్గజం ముఖేష్ అంబానీ సారథ్యంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ కు బంపర్ ఆఫర్ లభించింది. ఈ ఆఫర్ ను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్వయంగా ప్రకటించారు. కొద్దిసేపటి కిందటే తన అధికారిక సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ట్రూత్ సోషల్ లో దీనికి సంబంధించిన సమాచారాన్ని పోస్ట్ చేశారు. ఇది- అటు అమెరికా, ఇటు రిలయన్స్ ఇండస్ట్రీస్ లో ఓ చారిత్రాత్మక ఘట్టంగా నిలవనుంది. దీనికి కారణాలు లేకపోలేదు.

అమెరికా ప్రభుత్వం సొంతంగా నిర్మించబోయే ఆయిల్ రిఫైనరీలో రిలయన్స్ ఇండస్ట్రీస్ పెట్టబోతోంది. ఆ దేశ చమురు రంగంలో ఎంట్రీ ఇచ్చింది. దాదాపుగా 50 సంవత్సరాల తర్వాత అమెరికాలో నిర్మితం అయ్యే మొట్టమొదటి చమురు శుద్ధి కేంద్రం ఇదే కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. టెక్సాస్‌లోని బ్రౌన్స్‌విల్లే పోర్టులో ఇది నిర్మితం కానుంది. అమెరికా ఫస్ట్ రిఫైనింగ్ కంపెనీ దీన్ని నిర్మిచనుంది. ఆ దేశ చమురు రంగంలో ప్రధాన టెర్మినల్ గా రూపుదిద్దుకోనుంది.

Donald Trump Announces Reliance investment to Build American Oil Refinery After 50 Years in Texas

దీని మొత్తం పెట్టుబడి 300 బిలియన్ డాలర్లు. ఈ ఆయిల్ రిఫైనరీ ప్లాంట్ లో రిలయన్స్ ఇండస్ట్రీస్ భారీ పెట్టుబడి పెట్టనుంది. దీని నిర్మాణంలో రిలయన్స్ మద్దతును తీసుకుంటోన్నట్లు డొనాల్డ్ ట్రంప్ స్వయంగా వెల్లడించారు. దీన్ని చారిత్రాత్మక ఒప్పందంగా అభివర్ణించారాయన. "ఇది చారిత్రాత్మక 300 బిలియన్ డాలర్ల ఒప్పందం, అమెరికా చరిత్రలో అతిపెద్దది" అని ట్రంప్ పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టును తన ఇంధన ఎజెండాకు మూలస్తంభంగా రూపొందించామని తెలిపారు.

కాగా దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా వెల్లడి కాలేదు. రిలయన్స్.. దేశంలోని అతిపెద్ద ప్రైవేట్ ఆయిల్ రిఫైనరీలను నిర్వహిస్తోన్న విషయం తెలిసిందే. గుజరాత్ జామ్‌నగర్ ఉన్న చమురు శుద్ధి కర్మాగారం ప్రపంచంలోనే అతిపెద్దది. అమెరికా ఫస్ట్ రిఫైనింగ్ వెబ్‌సైట్ ఈ కంపెనీ ఎలిమెంట్ ఫ్యూయల్స్ ప్రాజెక్ట్ అని చెబుతోంది. 2024లో బ్రౌన్స్‌విల్లే రిఫైనరీని నాలుగు బిలియన్ల వ్యయంతో నిర్మించాలని మొదట ప్రణాళికలను ప్రకటించింది. ఇందులో రిలయన్స్ భాగస్వామ్యం కాబోతోండటంతో పెట్టుబడి మొత్తం భారీగా పెరిగింది.

ఈ ప్లాంట్ 1970 తర్వాత గల్ఫ్ ఆఫ్ మెక్సికోలో నిర్మించిన మొట్టమొదటి శుద్ధి కర్మాగారం అవుతుంది. 100 శాతం అమెరికన్ షేల్ ఆయిల్‌ను ప్రాసెస్ చేయడానికి రూపొందించనున్న ఏకైక శుద్ధి కర్మాగారం ఇదే.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+