Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఉప ప్రధానిగా చంద్రబాబు: వైఎస్ జగన్ రియాక్షన్

రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి విమర్శించారు. ముఖ్యంగా మహిళలపై జరుగుతున్న దాడుల విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తున్నారని.. మహిళల జోలికి వస్తే తాటతీస్తానని ప్రగల్భాలు పలుకుతున్న చంద్రబాబు, తన సొంత పార్టీ ఎమ్మెల్యేలు మరియు నేతలు మహిళలపై అకృత్యాలకు పాల్పడుతుంటే ఎందుకు మౌనంగా ఉన్నారని ఆయన ప్రశ్నించారు. మహిళల రక్షణ గురించి మాట్లాడే నైతిక హక్కు చంద్రబాబుకు లేదని జగన్ మండిపడ్డారు.

సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం ఒక మహిళపై లైంగిక దాడికి పాల్పడితే ప్రభుత్వం తీసుకున్న చర్యలేమిటని జగన్ నిలదీశారు. అలాగే ఆముదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్ ఒక మహిళా ప్రిన్సిపల్‌ను వేధించినా, గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ అశ్లీల వీడియో కాల్స్ వ్యవహారంలో దొరికిపోయినా చంద్రబాబు ఎందుకు స్పందించలేదని అడిగారు. రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ వ్యవహారంలో చర్యలు ఎక్కడని ప్రశ్నించారు. మంత్రి సంధ్యారాణి పీఏల వేధింపుల పర్వంలో బాధితులకే అన్యాయం జరిగిందని, రివర్స్‌లో బాధితులపైనే తప్పుడు కేసులు పెట్టడం దుర్మార్గమని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం ప్రజల దృష్టిని మళ్లించేందుకే చంద్రబాబు డైవర్షన్ రాజకీయాలకు పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు.

YS Jagan Mocks Chandrababu s Deputy PM Rumors People of Andhra Can t Bear Him How Will the Nation

ఆలయాల్లో ప్రమాదాలు..

తిరుమల పవిత్రత గురించి మాట్లాడే చంద్రబాబు, బీఆర్ నాయుడిని టీటీడీ ఛైర్మన్‌గా ఎలా నియమిస్తారని జగన్ ప్రశ్నించారు. దైవ భక్తి, నిష్ట ఉన్నవారిని నియమించాల్సిన చోట, నేరుగా బాధితురాలే లేఖ రాసినా పట్టించుకోకుండా పదవి కట్టబెట్టడంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. తిరుపతి, సింహాచలం, పలాస వంటి పుణ్యక్షేత్రాలలో భక్తులు చనిపోయినా, కదిరి రథోత్సవంలో ప్రమాదాలు జరిగినా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని దుయ్యబట్టారు. ఆలయాల నిర్వహణలో ప్రభుత్వానికి కనీస శ్రద్ధ లేదని ఆయన విమర్శించారు.

మూడో బిడ్డను కంటే..

ఎన్నికల మానిఫెస్టోలో ఇచ్చిన వాగ్దానాలను చంద్రబాబు గాలికి వదిలేశారని జగన్ ఎద్దేవా చేశారు. గతంలో ప్రకటించిన చంద్రన్న పెళ్లి కానుక ఇవ్వడానికే దిక్కులేదు కానీ, ఇప్పుడు మూడో బిడ్డను కంటే డబ్బులు ఇస్తామంటూ కొత్త నాటకాలకు తెరలేపారని విమర్శించారు. రాష్ట్రంలో రాబడులు తగ్గాయని చెబుతున్న చంద్రబాబు, తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికే ఇటువంటి ప్రకటనలు చేస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు లాంటి వ్యక్తులు అరుదుగా పుడతారని ఆయన ఎద్దేవా చేశారు.

ఆ క్రెడిట్ అంతా మా వాళ్లదే..

వైసీపీ వాళ్లు 11 మంది ఉన్నా 1100 మందిలా మాట్లాడతారంటూ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై జగన్ ఆసక్తికరంగా స్పందించారు. మా వాళ్లు అంతగా భయం పుట్టిస్తున్నారంటే అది గొప్ప సంగతే కదా అని, ఆ క్రెడిట్ అంతా తమ పార్టీ నేతలకే ఇవ్వాలని వ్యాఖ్యానించారు. ఇక చంద్రబాబు ఉప ప్రధాని అవుతారనే ప్రచారంపై స్పందిస్తూ, సీఎంగానే రాష్ట్ర ప్రజలు ఆయన్ను భరించలేకపోతున్నారని, ఇక దేశ ప్రజలు ఎలా భరిస్తారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. రాష్ట్ర అభివృద్ధి కంటే వ్యక్తిగత ఇమేజ్ కోసమే చంద్రబాబు పాకులాడుతున్నారని జగన్ విమర్శించారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+