Sai Baba: మద్యం సీసాలతో సాయిబాబాకు అభిషేకం.. ఆగ్రహం వ్యక్తం చేస్తున్న భక్తులు..
దేవుడికి సాధారణంగా పాల అభిషేకం, నీళ్ల అభిషేకం, పూల అభిషేకం చేస్తారు. కానీ ఓ చోట దేవుడి విగ్రహానికి మద్యం సీసాలతో అభిషేకం చేశారు. అది ఎక్కడో కాదు మన రాష్ట్రంలోనే. పశ్చిమ గోదావరి జిల్లా వేమరం గ్రామంలో మద్యం సీసాల్లో తెచ్చిన తేనెతో సాయి బాబా విగ్రహానికి అభిషేకం చేశారు. గురుపూర్ణిమ సందర్భంగా మద్యం సీసాల్లో తెచ్చిన తేనెతో కొందరు గ్రామస్థులు సాయిబాబా విగ్రహానికి అభిషేకం నిర్వహించారు.
వీరు మద్యం సీసాలతో అభిషేకం నిర్వహించడాన్ని చాలా మంది అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. భక్తుల అత్యుత్సాహంపై నెటిజన్లు మండిపడుతున్నారు. గురు పౌర్ణమి సాయి బాబాను భక్తి శ్రద్ధలతో పూజించకుండా మద్యం సీసాలతో అభిషేకం చేయడంపై విమర్శలు వస్తున్నాయి. తేనెతో అభిషేకం చేయటంలో ఎటువంటి ఇబ్బంది లేదు గానీ.. ఆ తేనెను మద్యం సీసాల్లో నింపి తీసుకొచ్చి బాబాకు అభిషేకం చేయడం సరికాదని అంటున్నారు.

మద్యం సీసాలతో సాయి బాబాకు అభిషేకం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. మద్యం సీసాలతో అభిషేకం చేయడంపై హిందూ సంఘాలు మండిపడుతున్నాయి. ఈ మద్య దేవుళ్లపై కూడా ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని వారు మండిపడుతున్నారు.












Click it and Unblock the Notifications