Ayodhya Ramireddy :వైసీపీ ఎంపీపై ఐటీ పంజా -హైదరాబాద్లో 15 చోట్ల సోదాలు
వైసీపీ రాజ్యసభ ఎంపీ అయోధ్య రామిరెడ్డిపై ఐటీ పంజా విసిరింది. రాంకీ గ్రూప్ అధినేత అయిన అయోధ్య రామిరెడ్డికి చెందిన హైదరాబాద్ నివాసాల్లో ఇవాళ ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. గచ్చిబౌలిలోని రాంకీ సంస్ధ ప్రధాన కార్యాలయంతో పాటు ఇతర చోట్లా దాడులు కొనసాగుతున్నాయి.
వైసీపీ రాజ్యసభ ఎంపీ, సీఎం జగన్ కు ఆప్తుడు అయిన అయోధ్య రామిరెడ్డికి చెందిన ఆస్తులపై ఆదాయపు పన్నుశాఖ అధికారులు ఉదయం నుంచీ దాడులు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ లోని ఐటీ విభాగానికి చెందిన దాదాపు 15 మంది అధికారుల బృందం పలు చోట్ల తనిఖీలు నిర్వహిస్తోంది. ఇందులో గచ్చిబౌలిలోని రాంకీ గ్రూప్ ప్రధాన కార్యాలయంతో పాటు గ్రూప్ అనుబంధ సంస్ధల కార్యాలయాలు, అయోధ్య రామిరెడ్డి నివాసం కూడా ఉన్నట్లు తెలుస్తోంది.

Recommended Video
వైసీపీలోని కీలక ఎంపీల్లో ఒకరైన అయోధ్య రామిరెడ్డి ఇళ్లపై ఐటీ సోదాలు కలకలం రేపుతున్నాయి. రాంకీ గ్రూప్ అధినేతగా ఉన్న అయోధ్య రామిరెడ్డి ప్రస్తుతం రాజ్యసభకు ఎంపికైన ఎంపీల్లో అత్యధిక ధనవంతుల జాబితాలో అగ్రస్ధానంలో ఉన్నారు. ఆయన ఆధ్వర్యంలో నడుస్తున్న రాంకీ గ్రూప్ సాలిడ్ వేస్ట్ మేనేజ్ మెంట్ తో పాటు పలు రంగాల్లో చురుగ్గా పనిచేస్తోంది. దీంతో ఆయన లావాదేవీలపై ఐటీ కన్ను పడినట్లు తెలుస్దోంది. రాంకీ గ్రూప్ అధినేతగా ఉంటూనే జగన్ కు సస్నిహితుడిగా పేరు తెచ్చుకున్న అయోధ్య రామిరెడ్డి గతేడాది రాజ్యసభ ఎంపీగా ఏపీ నుంచి ఎన్నికయ్యారు.. మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డికి అయోధ్య రామిరెడ్డి స్వయానా సోదరుడు.












Click it and Unblock the Notifications