TTD: శ్రీవారి భక్తులు, ఎమ్మెల్యేలకు గుడ్ న్యూస్ చెప్పిన చంద్రబాబు

కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వరస్వామి కొలువుతీరిన తిరుమలలో శ్రీవారిని దర్శించుకోవడానికి భక్తులు పోటీ పడుతుంటారు. అధికారంలో ఉన్న నాయకుల సిఫారసు లేఖలను తీసుకొని వెళ్లి తిరుమలలో శ్రీవారిని దర్శించుకుంటారు. తిరుమలలో శ్రీవారి బ్రేక్ దర్శనం కోసం ఆంధ్రప్రదేశ్ కు చెందిన అన్ని పార్టీల ఎమ్మెల్యేలు, ఎంపీల సిఫారసు లేఖల్ని టీటీడీ అధికారులు తీసుకుంటారు.

ప్రజా ప్రతినిధుల సిఫారసు లేఖలతో టీటీడీ అధికారులు ఆ లేఖలు తీసుకెళ్లిన భక్తులకు స్వామివారి దర్శనం చేసుకోవడానికి అవకాశం కల్పిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీల సిఫారసు లేఖలు తీసుకెళుతున్న భక్తులు తిరుమలలో శ్రీవారిని దర్శించుకుంటున్నారు. ముఖ్యంగా బ్రేక్ దర్శనానికి ఎమ్మెల్యేలు, ఎంపీల సిఫారసు లేఖలను ప్రతి రోజు వేల సంఖ్యలో టీటీడీ అధికారులకు చేరుతుంటాయి.

Increase in number of recommendation letters given by MLAs to devotees going to Tirumala

వాటిని పరిశీలించిన టీటీడీ అధికారులు స్వామివారిని దర్శించుకోవడానికి భక్తులకు అవకాశం కల్పిస్తుంటారు. అయితే ప్రజా ప్రతినిధుల సిఫారసు లేఖలకు కొన్ని కండిషన్స్ ఉన్నాయి. ప్రస్తుతం ఆ కండిషన్స్ సవరిస్తూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకున్నారు. తిరుమల శ్రీవారి దర్శనానికి ప్రస్తుతం వారం రోజుల్లో నాలుగు రోజులు ఎమ్మెల్యేలు ఇచ్చిన సిఫారసు లేఖలను టీటీడీ అధికారులు అనుమతిస్తున్నారు.

ఇకముందు ఎమ్మెల్యేలు ఇచ్చిన సిఫారసు లేఖలను ఆరు రోజులపాటు అనుమతి ఇచ్చేందుకు సీఎం చంద్రబాబు నాయుడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. వారంలో ఆరు రోజులు ఎమ్మెల్యేలు ఇచ్చిన సిఫారసు లేఖల్ని టీటీడీ అధికారుల పరిశీలించి ఆ లేఖలు తీసుకువెళ్లిన భక్తులకు తిరుమలలో శ్రీవారి దర్శనానికి వెళ్లడానికి అనుమతి ఇవ్వాలని చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం అంగీకరించింది.

Increase in number of recommendation letters given by MLAs to devotees going to Tirumala

అలాగే ఆరు రోజులపాటు 300 రూపాయలు టికెట్లు ఆరు ఇవ్వడానికి ఎమ్మెల్యేలకు అవకాశం ఇవ్వడానికి సీఎం చంద్రబాబు నాయుడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇదే సమయంలో తిరుమల శ్రీవారి దర్శనం టికెట్ల విషయంలో ప్రజా ప్రతినిధులు అవినీతికి పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని సీఎం చంద్రబాబు నాయుడు హెచ్చరించారు. ఆంధ్రప్రదేశ్ లోని 175 నియోజకవర్గాల్లోని ఎమ్మెల్యేలు అందరికీ తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తులకు సిఫారసు లేఖలు ఇచ్చే అవకాశం ఉంటుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+