మాడిసన్‌ మేయర్‌ పదవికి పోటీ పడనున్న తెలుగు వ్యాపారవేత్త!

న్యూయార్క్: భారత సంతతికి చెందిన వ్యాపారవేత్త అమెరికా అలబామాలోని మాడిసన్‌ నగర మేయర్‌ పదవికి పోటీ పడేందుకు సిద్ధమవుతున్నారు. నగరాన్ని దేశంలోనే ఉత్తమంగా తీర్చిదిద్దే ప్రణాళికలు తన వద్ద ఉన్నట్లు చెబుతున్నారు ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లాలో జన్మించిన 51ఏళ్ల హను కర్లపాలెం కర్లపాలెం.

ప్రస్తుతం ఆయన మాడిసన్‌లో నెట్‌వర్క్ సొల్యూషన్స్ సంస్థను నిర్వహిస్తున్నారు. త్వరలో మాడిసన్‌లో నిర్వహించే ఓ కార్యక్రమంలో తన అభ్యర్థిత్వంపై అధికారిక ప్రకటన చేయనున్నారు. ఓటర్లు నిర్ణయిస్తే నగరానికి నేతృత్వం వహించేందుకు తాను సరైన వ్యక్తినని పేర్కొన్నారు.

hanu

మాడిసన్‌ అభివృద్ధి కోసం మంచి దార్శనికతను కలిగి ఉన్నట్లు ఓ వార్తా వెబ్‌సైట్‌తో తెలిపారు. ‘అమెరికాలో వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాల్లో అలబామా ఒకటి. అందులో చిన్న నగరమైన మాడిసన్‌కు నాయకత్వం వహించగలనన్న నమ్మకం నాకుంది. అమెరికాలోనే మాడిసన్‌ను గొప్ప నగరంగా తీర్చిదిద్దాలన్నది నా లక్ష్యం' అని హను చెప్పారు.

అంతేగాక, ఈ ఎన్నికలు మాడిసన్‌కు మాత్రమే కాదు.. అలబామా రాష్ట్రంలోనే చరిత్రాత్మకమవుతాయని హను అన్నారు. ప్రస్తుత మేయర్ ట్రాయ్ ట్రలాక్ కంటే తనకు నగరంపై సమగ్రమైన దార్శనికత ఉందని.. అమెరికాలోని విద్యావంతమైన, మేధో నగరాల్లో మాడిసన్ ఒకటని హను కార్లపాలెం పేర్కొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+