ఏపీలో 2న్యూక్లియర్‌ ప్లాంట్ల ఏర్పాటుకు రంగం సిద్ధం: రష్యాతో భారత్ ఒప్పందం

న్యూఢిల్లీ: మేక్‌ ఇన్‌ ఇండియాలో భాగంగా రష్యా సహకారంతో రెండు న్యూక్లియర్‌ పవర్‌ ప్లాంట్లను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏర్పాటు చేసేందుకు రంగం సిద్ధం చేస్తోంది. రష్యా నిర్వహిస్తున్న కుడంకుళం ప్రాజెక్టుకు సంబంధించిన ఐదు, ఆరు యూనిట్లను ఇక్కడ స్థాపించాలని నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్రప్రభుత్వం భావిస్తోంది.

ఈ వారంలో ప్రధాని మోడీ మాస్కో పర్యటన సందర్భంగా ఈ మేరకు ఒప్పందం చేసుకుంటారని భావిస్తున్నారు. ఏపీలోని కొన్ని ప్రదేశాలను ఇప్పటికే ఈ ప్రాజెక్టుకోసం ఎంపిక చేసినట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే ఏపీలోని కొవ్వాడలో జీఈ-హిటాచీ సహకారంలో ఓ నూక్లియర్‌ ప్రాజెక్టు ఏర్పాటుకు సన్నాహాలు చేసింది.

India to offer site in Andhra Pradesh to Russia for nuclear power plants

కాగా, భారత్‌ పౌర-అణు కార్యక్రమంలో రష్యా కీలక భాగస్వామిగా ఉంది. గతంలో మోడీ- రష్యా అధ్యక్షుడు పుతిన్‌ మధ్య జరిగిన భేటీలో 2035నాటికి భారత్‌లో 12 న్యూక్లియర్‌ ప్లాంట్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.

కామన్ ఎంట్రాన్స్ టెస్టుల తేదీలను ప్రకటించిన గంటా

రాష్ట్రంలో నిర్వహించే కామన్ ఎంట్రాన్స్ టెస్టుల తేదీలను ఏపి విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు సోమవారం ప్రకటించారు. మే 8న ఎంసెట్, మే 9న సీసెట్, ఈసెట్, మే 16న ఐసెట్, మే23న ఎడ్ సెట్, మే 26న పీజీ సెట్, మే 28న పీజీ లా సెట్ నిర్వహించనున్నట్లు వెల్లడించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+