ఏపీ ఎన్నికల్లో ఆ పార్టీకే జై కొట్టిన జనం: జాతీయ మీడియా లేటెస్ట్ సర్వే రిపోర్ట్
Andhra Assembly elections 2024: సార్వత్రిక ఎన్నికలు సమీపించిన నేపథ్యంలో ఏపీలో అన్ని ప్రధాన రాజకీయ పార్టీలన్నీ సమరానికి సన్నద్ధమౌతోన్నాయి. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధం పేరుతో సమర శంఖాన్ని పూరించింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్వయంగా విశాఖపట్నం జిల్లా భీమిలీ సభలో రణభేరిని మోగించారు.
ఒంటరిగా ఎన్నికల బరిలో నిలిచిన వైఎస్ఆర్సీపీని ఎదుర్కొనడానికి ప్రతిపక్షాలు జట్టు కట్టాయి. తెలుగుదేశం- జనసేన పార్టీ పొత్తు పెట్టుకుని మరీ ఈ ఎన్నికలను ఎదుర్కొనబోతోన్నాయి. జెండా పేరుతో పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో తొలిసారిగా ఎన్నికల ప్రచార సభను నిర్వహించాయి.

ఏపీలో ఎన్నికల వేడి పతాక స్థాయికి చేరుకుంటోన్న పరిస్థితుల్లో- ఇది వరకు ఇండియా టీవీ, పోల్ స్ట్రాటజీ గ్రూప్, పొలిటికల్ క్రిటిక్, జీ న్యూస్- మ్యాట్రిజ్ సంస్థలు తమ అంచనాలను బయటపెట్టిన విషయం తెలిసిందే. అవన్నీ కూడా వైఎస్ఆర్సీపీకే పట్టం కట్టాయి. వరుసగా రెండోసారి ఈ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయని అంచనా వేశాయి.
తాజాగా ఒపీనియన్ పోల్‌ను నివేదికను వెల్లడించింది ఇండియా టీవీ సీఎన్ఎక్స్. దక్షిణాది రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, కేరళ లోక్‌సభ నియోజకవర్గాల్లో ఈ ఒపీనియన్ పోల్‌ను నిర్వహించిందా సంస్థ. ఏ పార్టీ మెజారిటీ సంఖ్యలో లోక్‌సభ స్థానాలను గెలుచుకుంటాయనే విషయంపై తన అంచనాలతో కూడిన నివేదికను విడుదల చేసింది.
దీని ప్రకారం చూస్తే- ఏపీలో వైఎస్ఆర్సీపీ హవా కొనసాగుతుంది. వైఎస్ఆర్సీపీకి జనం జైకొట్టారు. మెజారిటీ లోక్‌సభ స్థానాల్లో ఆధిపత్యం కనిపించింది. మొత్తం 25 లోక్‌సభ స్థానాలు ఉండగా.. వైఎస్ఆర్సీపీ 15 నుంచి 18 చోట్ల విజయ బావుటా ఎగురవేస్తుంది. ప్రతిపక్ష తెలుగుదేశం- జనసేన కూటమి ఏడు నుంచి 10 స్థానాలకే పరిమితమౌతుందని ఇండియా టీవీ సీఎన్ఎక్స్ అంచనా వేసింది.
దీన్ని ప్రాతిపదికన తీసుకుంటే- అసెంబ్లీ బరిలో వైఎస్ఆర్సీపీ ప్రభంజనం సృష్టించడం ఖాయం. మొత్తంగా 105 నుంచి 126 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఘన విజయాన్ని అందుకుంటుంది. సంక్షేమం- అభివృద్ధి వైపే మొగ్గు చూపారని ఇండియా టీవీ- సీఎన్ఎక్స్ పేర్కొంది. ప్రభుత్వం మీద ఎలాంటి వ్యతిరేక పవనాలు వీచట్లేదని వ్యాఖ్యానించింది.
కర్ణాటక లోక్‌సభ స్థానాల్లో మెజారిటీ సీట్లను బీజేపీ దక్కించుకోగలుగుతుంది. మొత్తం 28 నియోజకవర్గాల్లో బీజేపీ-22, కాంగ్రెస్- 4, జనతాదళ్ (సెక్యులర్)- 2 స్థానాలను గెలుచుకోగలుగుతాయి. కేరళలో కూడా బీజేపీ తన అకౌంట్ తెరిచే అవకాశాలు ఉన్నాయని అభిప్రాయపడింది.
కేరళలో మొత్తం 20 లోక్‌సభ స్థానాలు ఉండగా.. కాంగ్రెస్ సారథ్యంలోని యూడీఎఫ్- 11, వామపక్షాలకు చెందిన ఎల్డీఎఫ్- 6, బీజేపీ- 3 చోట్ల గెలుస్తాయి. తమిళనాడులో డీఎంకే-20, కాంగ్రెస్-6, బీజేపీ-5, ఏఐఏడీఎంకే-5 స్థానాల్లో విజయం సాధిస్తారు. ఇతరులు-5 చోట్ల విజయం సాధిస్తారని ఇండియా టీవీ- సీఎన్ఎక్స్ పేర్కొంది.
-
TDP MLC గ్రీష్మ పెళ్లి విషయంలో ట్విస్ట్, దాచాల్సింది ఏమీ లేదు! -
వివాదాల 'శాంతి'కి జైలు శిక్ష.. అవినీతి సామ్రాజ్యంపై ఏసీబీ పంజా! -
కడప ఎమ్మెల్యేలు, ఇన్ ఛార్జ్ లపై లోకేష్ సీరియస్..! రీజన్ ఇదే..! -
ఒరేయ్ ఆజామూ లగెత్తరోయ్.. తులం బంగారం రూ. 2 వేలే.. -
AP Inter Results 2026: ఇంటర్ ఫలితాలు ఎప్పుడంటే ? బోర్డు క్లారిటీ..! -
పేలిన బంగారం ధరల బాంబు- తారాజువ్వ -
IPL 2026: ముంబై ఇండియన్స్ కొంపముంచిన బుడ్డోడు! -
చెన్నై సూపర్ కింగ్స్ కు భారీ ఉపశమనం- పులి వచ్చింది -
ఓటీటీలోకి తెలుగు బోల్డ్ మూవీ.. అర్జున్ రెడ్డికి మించి.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్ -
today rashiphalalu: నేడు ముఖ్య గ్రహాల గోచారంతో వీరి పంట పండుతుంది.. మీరున్నారా? -
తమిళనాడు, కేరళ, బెంగాల్, అసోంలో గెలుపెవరిది ? సీఓటర్ తాజా సర్వే..! -
'హ్యాపీ బర్త్ డే బావా'.. ఎన్టీఆర్ ఎమోషనల్ పోస్ట్.. బన్ని షాకింగ్ రిప్లై..












Click it and Unblock the Notifications