వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

విపత్తు పునరుద్ధరణ: ఏపికి ప్రపంచ బ్యాంక్, కేంద్రం బాసట

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లో విపత్తు పునరుద్ధరణ పనులకు ప్రపంచ బ్యాంక్, కేంద్ర ప్రభుత్వం బాసటగా నిలిచాయి. విపత్తు పునరుద్ధరణ పనులకుగాను ప్రపంచ బ్యాంకు సుమారు 250 మిలియన్‌ డాలర్లు (రూ.1500 కోట్లకుపైగా) రుణంగా ఇవ్వనుంది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం, ప్రపంచ బ్యాంకు మధ్య ఆర్థిక ఒప్పందం కుదిరింది.

గురువారం నార్త్‌బ్లాక్‌లో జరిగిన కార్యక్రమంలో కేంద్రం తరపున ఆర్థిక శాఖ సంయుక్త కార్యదర్శి ఎస్‌ సెల్వకుమార్‌, ప్రపంచ బ్యాంకు తరఫున భారతదేశ డైరెక్టర్‌ ఒన్నో రుల్‌ ఈ ఒప్పందంపై సంతకాలు చేశారు. ఏపీ తరపున భూ, విపత్తు నిర్వహణ శాఖ ముఖ్య కార్యదర్శి జగదీశ్‌ చందర్‌ శర్మ సంతకం చేశారు.

ఏపీలో ఏర్పడే విపత్తుల్ని తట్టుకునే శక్తి సామర్థ్యాల పెంపునకు, ఆయా ప్రాంతాల్లోని ప్రజల జీవన ప్రమాణాలను పెంచేందుకు ఈ నిధుల్ని వినియోగించనున్నారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి జిల్లాల ప్రజలు నేరుగా ఈ పథకంతో లబ్ధి పొందనున్నారు. ఈ జిల్లాల జనాభా సుమారు 13.3 మిలియన్లుగా ఉంది.

India, World Bank sign financing agreement for Andhra Pradesh Disaster Recovery Project

కాగా, ఈ ప్రాజెక్టులో భాగంగా.. విద్యుత్తు సరఫరా వ్యవస్థను బలోపేతం చేయటం, రహదారుల పునరుద్ధరణ, మొదలైన కార్యక్రమాలను అమలు చేయనున్నారు. ఐదేళ్ల కాలంలో ఏపీ సర్కార్‌ ఈ పనులు చేపట్టాల్సి ఉంటుంది.

ఏపి, ఒడిశాలకు వరం: కేంద్ర కేబినెట్ నిర్ణయం

ఆంధ్రప్రదేశ్‌, ఒడిశా రాష్ట్రాల్లో తుఫాను ప్రమాద ఉపశమన పథకం(నేషనల్‌ సైక్లోన్‌ రిస్క్‌ మిటిగేషన్‌ ప్రాజెక్టు) మొదటి దశ అంచనాలను రూ.835 కోట్ల మేర పెంచుతూ కేంద్ర కేబినెట్‌ గురువారం నిర్ణయం తీసుకుంది. గతంలో ఈ ప్రాజెక్టు అంచనాలు రూ.1496.71 కోట్లు కాగా, ఆ మొత్తాన్ని కేంద్రం రూ.2331.71కి పెంచింది.

ఏపీ, ఒడిశా కోస్తా తీరంలో ఉండే మత్స్యకారులు, పేద ప్రజలు ఈ కేంద్ర ప్రాయోజిత పథకంతో లబ్ధి పొందనున్నారు. దీనికి కేంద్రం రూ.1843.94 కోట్లను ప్రపంచ బ్యాంకు రుణం రూపంలో ఇస్తుంది. మిగతా రూ.487.77 కోట్లను ఏపి, ఒడిశా రాష్ట్రాలు భరించాల్సి ఉంటుంది.

English summary
The financing agreement for World Bank assistance of USD 250 million for Andhra Pradesh Disaster Recovery Project was signed between Government of India and the World Bank here today.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X