రూ.5వేల కోట్ల పెట్టుబడులకు ముందుకొచ్చిన బ్యాంక్, కాపు రుణాలపై బాబు..
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో ఇండియన్ బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్ మహేష్ కుమార్ జైన్ గురువారం సమావేశమయ్యారు. ఏపీలో రూ.5వేల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చారు.
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో ఇండియన్ బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్ మహేష్ కుమార్ జైన్ గురువారం సమావేశమయ్యారు. ఏపీలో రూ.5వేల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చారు.
రాష్ట్రంలో మౌలిక సదుపాయాలు, విద్య, పర్యాటకం, ఆతిథ్య రంగాల్లో ఐదు వేల కోట్ల రూపాయలు పెట్టుబడులకు ఆయన సంసిద్ధత వ్యక్తం చేశారు. వెలగపూడిలోని సచివాలయంలో వీరి భేడీ జరిగింది.

ఈ సందర్భంగా ఇండియన్ బ్యాంక్ ప్రతిపాదనలను ముఖ్యమంత్రి చంద్రబాబు స్వాగతించారు. అమరావతిలో జోనల్ కార్యాలయం ఏర్పాటు చేయాలని ఇండియన్ బ్యాంక్ మేనేజర్ జైన్‌ను కోరారు. ఇందుకు ఆయన సానుకూలంగా స్పందించారు.
ఈ సందర్భంగా కాపు కార్పోరేషన్, బ్రాహ్మణ కార్పోరేషన్, ఎస్సీ, బీసీ, మైనారిటీ కార్పోరేషన్ల రుణాలు ఇండియన్ బ్యాంక్ ద్వారా అందజేసేందుకు ఒప్పందం కుదిరింది. ఇండియన్ బ్యాంకు ఇచ్చే రుణాల్లో సగం వ్యవసాయ రుణాలేనని చంద్రబాబుకు జైన్ వివరించారు. ఇండియన్ బ్యాంక్‌కు ప్రకాశం, గుంటూరు, కృష్ణా జిల్లాల్లో 145 మంది కరస్పాండెంట్లు ఉన్నారని తెలిపారు.












Click it and Unblock the Notifications