రైల్వే గుడ్ న్యూస్.. స్పెషల్ కంపార్ట్‌మెంట్ ఏర్పాటు?
మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు భారతీయ రైల్వే ప్రయత్నిస్తూనే ఉంది. ఇందులో భాగంగానే వందేభారత్ రైళ్లను తీసుకొచ్చింది. తాజాగా సబర్బన్ రైళ్లలో ఒక లగేజీ కంపార్ట్ మెంట్ ను వృద్ధుల కోసం రిజర్వు చేయాలని రైల్వే శాఖ యోచిస్తోంది. రద్దీగా ఉండే రైళ్లలో కూర్చొని
ప్రయాణించే అవకాశం ఉండట్లేదని సీనియర్ సిటిజన్లు ఫిర్యాదు చేస్తున్నారు. ఈ విషయమై 2022లో ముంబయి హైకోర్టులో ఒక ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) కూడా దాఖలైంది.
కేపీ పురుషోత్తమమ్ నాయర్ అనే 66 సంవత్సరాల వృద్ధుడు ఈ పిల్ దాఖలు చేశారు. ముంబై సబర్బన్ రైళ్లలో ప్రయాణించేటప్పుడు సీనియర్ సిటిజన్లు ఎటువంటి ఇబ్బందులను ఎదుర్కొంటున్నారో ఆయన అందులో వివరించారు. పై ప్రయాణించే సీనియర్ సిటిజన్ల దుస్థితిని ఆయన ప్రస్తావించారు. రైళ్లలో సౌకర్యవంతంగా కూర్చోవడానికి వృద్ధులకు స్థలం దొరకడంలేదని, సురక్షితంగా, సుఖంగా ప్రయాణించే మార్గాన్ని సూచించాలంటూ కోరారు.

దీనిపై అధికారులు ఒక సర్వే నిర్వహించారు. వృద్ధులకు ప్రత్యేకంగా ఒక కంపార్ట్ మెంట్ ను రిజర్వు చేయడంపై సాధ్యాసాధ్యాలను అంచనా వేశారు. జనరల్ బోగీలన్నీ తీవ్ర రద్దీతో ఉంటాయి. 30 శాతం అదనంగా ప్రయాణిస్తుంటారు. అవి వృద్ధులకు కష్టమవుతుంది కాబట్టి ఖాళీగా ఉండే లగేజ్ బోగీని కేటాయిస్తే బాగుంటుందని భావిస్తున్నారు. లోకల్ రైళ్లల్లో సీనియర్ సిటిజన్లకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలనే అంశం కొన్ని సంవత్సరాలుగా రైల్వేలో నానుతోంది. 2015లో ముంబయి హైకోర్టు సీనియర్ సిటిజన్ల కోసం ప్రత్యేకంగా ప్రతి సబర్బన్ ట్రైన్‌లో 14 సీట్లను రిజర్వ్ చేయాలని వెస్ట్రన్ రైల్వేని ఆదేశించింది. రానున్న రోజుల్లో భారతీయ రైల్వేలో సీనియర్ సిటిజన్ల ప్రయాణం సుఖవంతంగా సాగేందుకు చర్యలు చేపట్టబోతున్నారు.












Click it and Unblock the Notifications