ఒకే టికెట్ పై 56 రోజుల ప్రయాణం చేయవచ్చు!
భారతీయుల జీవన గమనంలో రైల్వే విడదీయరాని భాగమైంది. పుణ్యస్థలాలు, ఉద్యోగాలు, వ్యాపారంటూ నెలలోనే వందల కిలోమీటర్ల దూరం ప్రయానించేవారుంటారు. అలాంటివారికి ప్రయోజనం కలిగేలా భారతీయ రైల్వే సర్క్యులర్ జర్నీ టికెట్ జారీచేస్తోంది. తక్కు వ ఖర్చుతో ఎక్కువ దూరం ప్రయాణం చేయవచ్చు. వీటి ప్రయోజనాలను తెలుసుకుందాం.
ఈ సర్క్యులర్ టికెట్లపై ఎవరికీ పెద్దగా అవగాహన లేదు. ఏ క్లాసునైనా ఎంచుకోవచ్చు. ప్రయాణం ప్రారంభించిన స్టేషన్ నుంచి తిరిగి అక్కడకు చేరుకునేంతవరకు ఈ టికెట్ చెల్లుబాటవుతుంది. ఎనిమిది బ్రేక్ జర్నీలుంటాయి. ఎంపిక చేసుకున్న 8 స్టేషన్లలో దిగి కొద్దిరోజులు చుట్టుపక్కల ప్రాంతాలను సందర్శించిన తర్వాత తాజాగా ప్రయానాన్ని ప్రారంభించవచ్చు. ఇలా ఒకే టికెట్ పై గరిష్టంగా 56 రోజులపాటు జర్నీచేయవచ్చు. పుణ్యక్షేత్రాలకు వెళ్లేవారికి, విహార యాత్రలకు వెళ్లేవారికి ఈ టికెట్ బాగా ఉపయోగపడుతుంది.

మన జర్నీ ప్రణాళిక తీసుకొని రైల్వే డివిజనల్ కమర్షియల్ మేనేజర్ ను సంప్రదించాలి. మన జర్నీని బట్టి టికెట్ ధరను లెక్కించి ఈ విషయాన్ని స్టేషన్ మేనేజర్ కు తెలియజేస్తారు. మనం ఎక్కడైతే ప్రయాణాన్ని ప్రారంభిస్తున్నామో అక్కడి స్టేషన్ బుకింగ్ కార్యాలయంలో టికెట్ కొనుగోలు చేయడంతోపాటు బ్రేక్ స్టేషన్లను కూడా ఎంచుకోవచ్చు.
ప్రయాణ రోజులు, విరామ ప్రయాణ రోజులు, టికెట్ చెల్లుబాటు వ్యవధిని పరిగణనలోకి తీసుకొని టికెట్ లెక్కిస్తారు. 400 కిలోమీటర్ల దూరానికి ఒకరోజు, ప్రయాణం చేయని రోజుల్లో 200 కిలోమీటర్లు ఒకరోజుగా లెక్కిస్తారు. టికెట్ పై ప్రయాణికుడి సంతకం ఉండాలి. 1000 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తే సీనియర్ సిటిజన్లకు రాయితీ ఉంటుంది. పురుషులకు 40 శాతం, స్త్రీలకు 50 శాతం రాయితీ ఉంటుంది. విడివిడిగా తీసుకునే టికెట్ ధరలకన్నా సర్క్యులర్ జర్నీ టికెట్ ఎంతో చౌకగా ఉంటుంది. పదే పదే టికెట్ కొనుగోలు చేయాల్సిన అవసరం ఉండదు.












Click it and Unblock the Notifications