మనదేశంలో అతిపెద్ద రైల్వే జంక్షన్ తెలుసా?
ఆసియా ఖండంలోనే రెండో స్థానంలో, ప్రపంచంలో నాలుగో స్థానంలో భారతీయ రైల్వే నిలిచింది. అంత పెద్ద నెట్ వర్క్ ను కలిగి ఉండటం అంటే సాధారణ విషయమేం కాదు. రైల్వేల ద్వారానే ప్రతిరోజు లక్షల మంది తమ గమ్యస్థానాలకు చేరుకుంటుంటారు. రైల్వే అనేది భారతీయులకు ఆర్థికంగా ఎంతో సౌకర్యవంతంగా ఉండే ప్రయాణ సాధనం.
సాధారణ ప్యాసింజర్ రైలు తయారు చేయడానికి సగటున రూ.66 కోట్లు ఖర్చవుతుంది. ప్రస్తుతం వందే భారత్ రైళ్లు భారతీయ రైల్వే రూపురేఖలను మార్చేశాయి. అధునాతన సౌకర్యాలతో ప్రమాణికుల నుంచి మంచి ఆదరణ దక్కించుకున్నాయి. కొత్త తరం రైళ్లయిన వందే భారత్ రైలు ఒకటి తయారు చేయడానికి రూ.115 కోట్లు ఖర్చవుతుంది. మనదేశంలో ఎక్కువగా డీజిల్, ఎలక్ట్రిక్ ఇంజన్ రైళ్లు నడుస్తుంటాయి. ఒక్కో ఇంజన్ తయారు చేసేందుకు రూ.13 నుంచి రూ.20 కోట్ల వ్యయం అవుతుంది.

మనం ప్రయాణించే బోగీ (కంపార్ట్ మెంట్) ఒకటి తయారు చేయడానికి రూ.2 కోట్లు ఖర్చవుతుంది. జనరల్ రైళ్లల్లో ఉండే కంపార్ట్ మెంట్స్ తక్కువ వ్యయమవుతాయి. అయితే ఏసీ బోగీల ధరలు మాత్రం ఎక్కువవుతాయి. రానున్న రోజుల్లో వందే భారత్ రైళ్లకే స్లీపర్ బోగీలు తయారుచేస్తున్నారు. తాజాగా అవి సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. వీటి తయారీకి ఎంతవుతాయనే విషయం ఇంకా బయటకు రాలేదు. అత్యాధునికంగా, ఫైవ్ స్టార్ హోటల్ తరహాలో వీటి నిర్మాణం జరుగుతోంది.
భారతదేశంలో అతిపెద్ద రైల్వే జంక్షన్ గా హౌరా నిలిచింది. ప్రతిరోజు ఈ స్టేషన్ నుంచి 600 రైళ్లు ప్రయాణిస్తాయి. అలాగే అతి చిన్న రైల్వేస్టేషన్ గా IB నిలుస్తోంది. ఈ స్టేషన్ లో కేవలం రెండు ప్లాట్ ఫారాలు మాత్రమే ఉంటాయి.












Click it and Unblock the Notifications