నిషేధాన్ని ఎత్తేసిన ఇండిగో: జేసీ దివాకర్ రెడ్డికి ఊరట

తెలుగుదేశం పార్టీ నేత, అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డికి బుధవారం ఊరట లభించింది.

అమరావతి: తెలుగుదేశం పార్టీ నేత, అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డికి బుధవారం ఊరట లభించింది. ఇండిగో ఎయిర్ లైన్స్ ఆయనపై నిషేధాన్ని ఎత్తివేసింది.

గతంలో విశాఖ విమానాశ్రయంలో జేసీ అధికారులతో దురుసుగా ప్రవర్తించారు. దీంతో ఇండిగో ఆయనపై నిషేధం విధించింది. పలు విమానయన సంస్థలు కూడా ఆయనపై నిషేధం విధించాయి.

Indigo lifts ban on MP JC Diwakar Reddy

దీనిపై ఆయన న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. అక్కడ ఆయనకు చుక్కెదురయింది. మీ ట్రావెల్స్ బస్సులోని ప్రయాణీకులు ఇలాగే వ్యవహరిస్తే ఊరుకుంటారా అని న్యాయస్థానం నిలదీసింది.

నిషేధం నేపథ్యంలో ఇటీవల రాష్ట్రపతి ఎన్నికల్లో ఢిల్లీలో ఓటు వేయడానికి జేసీ దివాకర్ రెడ్డి ప్రత్యేకంగా చార్టర్డ్ ప్లైట్‌లో వెళ్లారు. ఇందుకు రూ.7 లక్షల వరకు ఖర్చు అయింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+