ఇన్‌స్టాగ్రామ్ పరిచయమే రమ్య ప్రాణాలు తీసిందన్న పోలీసులు .. రాజకీయం చెయ్యొద్దని విజ్ఞప్తి

గుంటూరు కాకాణి వద్ద అత్యంత దారుణంగా ప్రేమోన్మాది చేతిలో హత్యకు గురైన రమ్య కేసులో పోలీసులు కీలక విషయాలు వెల్లడించారు. 20 సంవత్సరాల బీటెక్ విద్యార్థిని రమ్యను హతమార్చిన నిందితుడు శశి కృష్ణను అరెస్టు చేశామని చెప్పిన పోలీసులు రమ్య కేసులో వివరాలతో పాటు ఇలాంటి ఘటనల విషయంలో ప్రజల స్పందన అవసరం అన్నారు. రమ్య హత్య కేసుపై ఇన్చార్జి డిఐజి రాజశేఖర్ బాబు, ఎస్పీ నిర్వహించిన మీడియా సమావేశంలో ఇన్‌స్టాగ్రామ్ ద్వారా రమ్యకు, శశి కృష్ణతో పరిచయం ఉందని, గత ఆరు నెలలుగా వారిద్దరూ మాట్లాడుకుంటున్నారని వెల్లడించిన పోలీసులు సోషల్ మీడియా ద్వారా ఏర్పడిన పరిచయమే రమ్య చావుకు కారణమైందని వెల్లడించారు.

రమ్యకు శశి కృష్ణకు ఇన్‌స్టాగ్రామ్ పరిచయం .. ప్రేమించాలని వేధించిన శశి కృష్ణ

రమ్యకు శశి కృష్ణకు ఇన్‌స్టాగ్రామ్ పరిచయం .. ప్రేమించాలని వేధించిన శశి కృష్ణ


రమ్యను తనను ప్రేమించాలని శశి కృష్ణ నిత్యం బస్స్టాండ్ వద్దకు వెళ్లి వేధించేవాడని, రెండునెలలుగా వేధింపులు పెరగడంతో రమ్య శశి కృష్ణ తో పూర్తిగా మాట్లాడడం మానేసింది అని ఇన్ఛార్జి డిఐజి రాజశేఖర్ బాబు వెల్లడించారు. ఈ క్రమంలోనే తనను ప్రేమించటం లేదన్న కోపంతో, తనను ప్రేమించకుంటే చంపుతానని అనేకమార్లు బెదిరించిన నిందితుడు నిన్న రమ్యతో గొడవకు దిగి అత్యంత కిరాతకంగా నరికి చంపాడు అని పేర్కొన్నారు. రమ్య శరీరం పై ఆరు కత్తిపోట్లు ఉన్నాయని జిజిహెచ్ కు తరలించే క్రమంలోనే రమ్య ప్రాణాలు కోల్పోయిందని వెల్లడించారు.

 సోషల్ మీడియా పరిచయాలకు దూరంగా ఉండాలన్న ఇంచార్జ్ డీఐజీ

సోషల్ మీడియా పరిచయాలకు దూరంగా ఉండాలన్న ఇంచార్జ్ డీఐజీ

సోషల్ మీడియా ద్వారా ఏర్పడే పరిచయాలకి దూరంగా ఉండాలని పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఒకవేళ ఎవరైనా సోషల్ మీడియా ద్వారా వేధింపులకు గురి చేస్తే వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని పేర్కొన్నారు రమ్య కూడా ముందుగానే పోలీసులకు ఫిర్యాదు చేసి ఉంటే పరిస్థితి మరోలా ఉండేదేమో అని అభిప్రాయపడ్డారు. సోషల్ మీడియా ట్రాప్ లో పడకుండా మహిళలు జాగ్రత్తగా ఉండాలని పేర్కొన్నారు పోలీసులు. ఇలాంటి ఘటనలు జరగకుండా నిరోధించడానికి ప్రభుత్వం, పోలీసు యంత్రాంగం ఎంతో ప్రయత్నం చేస్తోందని, ఫిర్యాదులు చేయడానికి నెంబర్లను కూడా అందుబాటులో ఉంచిందని వెల్లడించారు.

ప్రజలు వెంటనే స్పందించి ఉంటే బాగుండేదన్న పోలీసులు

ప్రజలు వెంటనే స్పందించి ఉంటే బాగుండేదన్న పోలీసులు

ప్రతి చోట దిశా పెట్రోలింగ్ ఉందని, మహిళా పోలీసులు ఉంటున్నారని, ఇలాంటి ఘటనలకు కారణం పోలీసులు కాదని వెల్లడించారు. ఎలాంటి ఇబ్బంది ఉన్నా ముందు ఫిర్యాదు చేయాలని, చేయకుండా పోలీసులది బాధ్యత అంటే ఎలా అని ప్రశ్నించారు. ఫిర్యాదు చేసిన తరువాత ఇలాంటి సంఘటనలు జరిగితే, పోలీసులు స్పందించకపోతే దానికి బాధ్యత వహిస్తామని వెల్లడించారు. అంతేకాదు నిన్న జరిగిన ఘటనలో అక్కడే ఉన్న ప్రజలు వెంటనే స్పందించి ఉంటే బాగుండేదని, నిందితుడు దాడి చేస్తుంటే ఎవరు స్పందించక పోవడం వల్లే రమ్య ప్రాణాలు కోల్పోయింది అని ఇంచార్జి డీఐజీ వెల్లడించారు.

 పోలీసులు చేసిన తప్పేంటి ? శవ రాజకీయాలు ఆపండి

పోలీసులు చేసిన తప్పేంటి ? శవ రాజకీయాలు ఆపండి

సోషల్ మీడియా వల్ల జరిగే అనర్థాలను బాలికలు, మహిళలకు మరింత అర్థమయ్యేలా చెప్పాలని నిర్ణయించామని పేర్కొన్నారు. త్కాజా ఘటనపై పోలీసులకు వ్యతిరేకంగా చేస్తున్న ఆందోళనలపై తీవ్ర అసహనం వ్యక్తం చేసిన పోలీసులు శవ రాజకీయాలు చేయడం మంచిది కాదని హితవు పలికారు. పోలీస్ శాఖ ఏం తప్పు చేసింది అని ప్రశ్నించి, హత్య జరిగిన తరువాత నిందితుడిని పట్టుకున్నామంటూ పేర్కొన్నారు. ఈ కేసులో అనవసరంగా రాజకీయాలను తీసుకురావద్దని హితవు పలికారు. మృతురాలి ఫోన్ తమ వద్దే ఉందని, ఆమె ఫోన్లో డిలీట్ అయిన వివరాలను కూడా సేకరించి విశ్లేషణ చేసి, ఈ కేసులో నిజానిజాలను బయటకు తీసుకు వస్తామని ఇన్చార్జి డీఐజీ రాజశేఖర్ వెల్లడించారు. ఇబ్బంది కలిగినప్పుడు పోలీస్ స్టేషన్ కు రావడంలో తప్పు లేదని పేర్కొన్న ఆయన మహిళలపై దాడులు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+