అల్లూరికి అవమానం ? భీమవరంలో ఆవిష్కరణకు రాని మోడీ-వర్చువల్ గానే-కారణాలివే ?
విప్లవవీరుడు అల్లూరి సీతారామరాజు 125వ జయంతోత్సవాలను పురస్కరించుకుని 30 అడుగుల విగ్రహాన్ని భీమవరంలో ఏర్పాటు చేశారు. దాన్ని ఆవిష్కరించేందుకు ప్రధాని మోడీ కూడా హస్తిన నుంచి వచ్చారు. అయితే ప్రధాని మోడీ భీమవరంలో విగ్రహావిష్కరణ మాత్రం చేయలేదు. కేవలం బహిరంగసభ ఏర్పాటు చేసిన పెద అమిరం నుంచే వర్చువల్ విధానంలో అల్లూరి విగ్రహావిష్కరణ చేశారు. దీంతో ఈ వర్చువల్ ఆవిష్కరణపై విమర్శలు వినిపిస్తున్నాయి.

అల్లూరి విగ్రహావిష్కరణ
భీమవరంలోని ఏఎస్ఆర్ పార్క్ లో ఇవాళ విప్లవవీరుడు అల్లూరి సీతారామరాజును గుర్తుచేసేలా ఏర్పాటు చేసిన 30 అడుగుల విగ్రహాన్ని ఆవిష్కరణ కోసం ఏర్పాటు చేశారు. దీన్ని ఆవిష్కరించేందుకు ప్రధాని మోడీ ఢిల్లి నుంచి తరలివచ్చారు. ప్రధాని మోడీ నేరుగా ఈ విగ్రహాన్ని ఆవిష్కరిస్తే అల్లూరికి ఆజాదీకా అమృత్ మహోత్సవ్ వేళ అంతకు మించిన గౌరవం ఉండదని ఈ ప్రాంత ప్రజలు ఆశించారు.కానీ సీన్ రివర్స్ అయింది.

పర్చువల్ గానే విగ్రహావిష్కరణ
ప్రధాని మోడీ భీమవరంలో ఏర్పాటు చేసిన అల్లూరి సీతారామరాజు విగ్రహాన్ని ఆవిష్కరిస్తారని భావించిన వారికి చివరి నిమిషంలో షాక్ తగిలింది. భీమవరానికి మోడీ రావడం లేదని తేలిపోయింది. దీనికి బదులుగా వర్చువల్ విధానంలోనే విగ్రహావిష్కరణ చేయాలని ఆయన భావించారు. దీంతో పెద అమిరంలో ఏర్పాటు చేసిన బహిరంగసభలో ప్రధాని మోడీ రిమోట్ కంట్రోల్ ద్వారా అల్లూరి విగ్రహావిష్కరణ పూర్తి చేశారు. దీంతో అప్పటివరకూ భీమవరంలో ఈ కార్యక్రమం జరుగుతుందని ఆశించిన వారికి నిరాశ తప్పలేదు.

అల్లూరికి అవమానం ?
విప్లవవీరుడు అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణ కోసం ప్రధాని మోడీ భీమవరానికి రావాలని భావించారు. దీంతో జనం కూడా అల్లూరి విగ్రహం ఇక్కడే ఆవిష్కరిస్తారని ఆంతా భావించారు. అలాగే ఇక్కడి క్షత్రియులు కూడా ఘనంగా ఏర్పాట్లు చేశారు. జన సమీకరణ కూడా చేపట్టారు. అయితే చివరి నిమిషంలో ప్లాన్ మారిపోవడంతో ప్రధాని మోడీ భీమవరం రాకుండా పెద అమిరం నుంచే ఈ కార్యక్రమం వర్చువల్ విధానంలో నిర్వహించారు. దీంతో ఢిల్లీ నుంచి ఇక్కడికి వచ్చి మరీ అల్లూరి విగ్రహం వద్దకు వెళ్లకుండా మోడీ తిరిగి వెళ్లనుండటం ఆయన్ను అవమానించినట్లేనన్న విమర్శలు వస్తున్నాయి.

చివరి నిమిషంలో మార్పు వెనుక ?
అయితే అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని ప్రధాని మోడీ భీమవరంలో కాకుండా పెద అమిరం బహిరంగసభలో చేపట్టడం వెనుక కీలక కారణాలున్నాయి. ప్రధాని మోడీ రాక సందర్భంగా భీమవరంలో భారీ ఎత్తున జనం తరలివస్తున్నట్లు నివేదికలు అందాయి. అలాగే క్షత్రియులంతా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు, మోడీకి రాజుల గొప్పతనం తెలియజేసేలా పలు కార్యక్రమాలు చేపట్టాలని భావించినట్లు తెలుస్తోంది. అయితే వీటి కారణంగా ప్రధాని మోడీ భద్రతకు ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని నిఘా సమాచారం వచ్చినట్లు సమాచారం. దీంతో చివరి నిమిషంలో విగ్రహావిష్కరణ నేరుగా కాకుండా వర్చువల్ గా నిర్వహించినట్లు తెలుస్తోంది.
-
జీవన్ రెడ్డికి కేసీఆర్ బిగ్ టాస్క్, ఆపరేషన్ బిగిన్..!! -
భానుడి భగభగలు, పిడుగులతో భారీ వర్షాలు - ఈ ప్రాంతాలకు తాజా హెచ్చరికలు..!! -
Vaibhav Sooryavanshi: బుడ్డోడు మరో వరల్జ్ రికార్డు-కేవలం రెండో బ్యాటర్..! -
'డెకాయిట్'లో అసలైన ట్విస్ట్ ఇదే! -
PM-Rahat: యాక్సిడెంట్ బాధితులకు క్యాష్ లెస్ ట్రీట్మెంట్-ఆస్పత్రులకు ఆదేశాలు..! -
Tamil Nadu polls: చివరి 'బ్రహ్మాస్త్రం' ప్రయోగించిన విజయ్.. ఇక సైకిల్ టూ సీఎం సీటే..! -
Video: ఇదెక్కడి మాస్ రా మావా. బటన్ నొక్కితే బండి నంబర్ ప్లేట్ ఛేంజ్ -
SRH కొంపముంచిన క్లాసెన్ జిడ్డు బ్యాటింగ్ -
రేపే రాజ పంచక కాలం ప్రారంభం -
వైభవ్ సూర్యవంశీ RCB పై ఆడిన సునామీ ఇన్నింగ్ దెబ్బకు.. !! -
రోజూ గుప్పెడు గింజలు తినండి.. షుగరు, బీపీ పూర్తిగా కంట్రోల్...!! -
చరిత్ర సృష్టించిన భారత ఆయిల్ ట్యాంకర్ 'జగ్ విక్రమ్'.. 20 వేల టన్నుల LPGతో హార్మూజ్ ను దాటి..











Click it and Unblock the Notifications