విశాఖపట్నం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఏపీలో కుండపోత - ఆ జిల్లాల్లో అతి భారీ వర్షాలు

|
Google Oneindia TeluguNews

అమరావతి: బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తోన్నాయి. పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడుతున్నాయి. అర్ధరాత్రి చినుకులతో ఆరంభమైన వర్షం ఇక ఎడతెరిపినివ్వలేదు. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. జనజీవనం స్తంభించింది. ఇదే పరిస్థితి ఇంకో 48 గంటల పాటు ఉండొచ్చని అమరావతి వాతావరణ కేంద్రం అంచనా వేసింది.

బంగాళాఖాతంలో 3.1 కిలోమీటర్ల ఎత్తున ఈ ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. క్రమంగా విస్తరిస్తోంది. మధ్య-దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతాల మీదుగా కొనసాగుతోంది. దీని ప్రభావంతో పలు జిల్లాల్లో భారీ వర్షపాతం నమోదైంది. రాత్రి నుంచి ఏకధాటిగా వర్షం కురుస్తోంది. దక్షిణ కోస్తాలోని కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, కడప, అన్నమయ్య, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి పుట్టపర్తితో పాటు ఉత్తరాంధ్రలోని విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో ఉరుములతో కూడిన వర్షం పడుతోంది.

Intense rain fall in across the State of Andhra Pradesh, due to depression over Bay of Bengal

ఇదే పరిస్థిితి మరో రెండు రోజుల పాటు కొనసాగే అవకాశం ఉన్నట్లు వాతావరణ కేంద్రం అధికారులు అంచనా వేస్తోన్నారు. ఇది మరింత విస్తరించే అవకాశం ఉన్నట్లు అభిప్రాయపడ్డారు. తూర్పుగోదావరి, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ, కాకినాడ జిల్లాలపైనా ప్రభావం ఉంటుంది. ఇప్పటికే ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాల్లో కొన్నిచోట్ల వర్షం కురిసింది.

అత్యధికంగా విశాఖపట్నం సీతమ్మధారలో 118 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. పెందుర్తి-81, మహారాణిపేట-79, ముడసర్లోవ-76, సింహాచలం-61, వుడా పార్క్-61, సింహపురి కాలనీ-53, అక్కిరెడ్డిపాలెం-51, అప్పన్నపాలెం-48, ప్రహ్లాదపురం-46, గాజువాక-46, గంగవరం-36, ఎంవీపీ కాలనీ-35 మిల్లీమీటర్ల మేర వర్షం కురిసింది. కడప జిల్లాలో అత్యధిక వర్షపాతం జమ్మలమడుగు, ప్రొద్దుటూరుల్లో నమోదైంది. మూడుగంటల పాటు ఏకధాటిగా వర్షం పడింది.

English summary
Intense rain fall in across the State of Andhra Pradesh, due to depression over Bay of Bengal
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X