పదో తరగతి, ఇంటర్ ఫలితాల విడుదల ముహూర్తం..!!
పదో తరగతి.. ఇంటర్ ఫలితాలు ఎప్పుడు. పరీక్షలు రాసిన విద్యార్ధులు ఆతృతగా రిజల్ట్స్ కోసం నిరీక్షిస్తున్నారు. ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ మూల్యాంకనం ప్రారంభమైంది. ఏపీలో ఇంటర్ విద్య లో తెచ్చిన మార్పులతో తొలి ఏడాది ఇంటర్ క్లాసులు మొదలు పెట్టారు. దీంతో, త్వరిత గతిన ఫలితాలను వెల్లడించేలా రెండు ప్రభుత్వాలు కసరత్తు చేస్తున్నాయి. ఈ మేరకు దాదాపుగా ఫలితాల విడుదల పైన ఒక అంచనాకు వచ్చాయి.
మూల్యాంకనం - ఫలితాలు
రెండు తెలుగు రాష్ట్రాల్లో పదో తరగతి.. ఇంటర్ పరీక్షలు పూర్తయ్యాయి. ఇప్పుడు విద్యార్ధులు వచ్చే విద్యా సంవత్సరం ప్రణాళికల్లో నిమగ్నమయ్యారు. ఈ ఫలితాలు వెల్లడి తరువాత ఎంట్రన్స్ లు.. కొత్త కోర్సుల్లో చేరేందుకు కసరత్తు చేస్తున్నారు. ఏపీలో ఈ నెల మూడో తేదీ నుంచి పదో తరగతి మూల్యాకనం ప్రారంభించారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా రికార్ఢు స్థాయిలో 7 రోజుల్లోనే అంటే ఏప్రిల్ 9లోగా మూల్యాంకనం పూర్తి చేసేందుకు ఏపీ విద్యాశాఖ ఏర్పాట్లు చేస్తోంది. అనుకున్నట్టే జరిగితే ఈ నెల చివరి వారంలో ఏపీలో టెన్త్ ఫలితాలు విడుదలవుతాయి లేదంటే మే తొలి వారం లో రిలీజ్ చేయాలని భావిస్తున్నారు.

ఈ నెలాఖరులో
ఏపీ పదో తరగతి ఫలితాల కోసం విద్యార్థులు వాట్సాప్ నెంబర్ 9552300009 లేదా అధికారిక వెబ్‌సైట్ https://www.bse.ap.gov.in/ ద్వారా అందుబాటులోకి తేనున్నారు. అదే విధంగా తెలంగాణలో కూడా ఏపీలో లాగే పదో తరగతి పరీక్షా ఫలితాలు ఈ నెలాఖరు కల్లా వచ్చే అవకాశముందని అధికారులు చెబుతున్నారు. తెలంగాణ టెన్త్ ఫలితాల కోసం అధికారిక వెబ్‌సైట్ - https://www.bse. telangana.gov.in లో పొందు పేర్చనున్నారు. ఇక, ఇంటర్ ఫలితాలు ఈ సారి గతం కంటే వేగంగా విడుదల కానున్నాయి. ఏపీలో ఇప్పటికే ఇంటర్ పరీక్షల మూల్యాంకనం వేగంగా కొనసాగుతోంది. ఏప్రిల్ 6 నాటికి మూల్యాంకనం పూర్తయ్యే అవకాశం ఉంది. ఆ తర్వాత ఫలితాలను కంప్యూటరీకరణ చేసేందుకు 5-6 రోజుల సమయం పడుతుంది.
వాట్సప్ లో ఫలితాలు
ఈ సంవత్సరం టెన్త్, ఇంటర్ హాల్‌టికెట్లు విడుదల చేసినట్టుగానే వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ఫలితాలు కూడా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సారి ఫలితాలను వాట్సాప్ నంబర్ 9552300009 లేదా BIEAP అధికారిక వెబ్‌సైట్ https://bie.ap. gov.in/ ద్వారా విద్యార్థులు తమ ఫలితాలను తెలుసుకునేలా ఏర్పాట్లు చేస్తు న్నారు. అదే విధంగా తెలంగాణ లోనూ ఇంటర్ ఫలితాలు ఈ నెల చివరి వారంలో ఫలితాలు విడు దల చేయనున్నట్లు తెలంగాణ రాష్ట్ర ఇంటర్మీడియట్ విద్యా మండలి అధికారులు చెబుతు న్నారు. ఫలితాల కోసం tgbie.cgg.gov.in లో చెక్ చేసుకోవాల్సి ఉంటుంది.












Click it and Unblock the Notifications