అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సీఎం జగన్ తో మెగాస్టార్ భేటీ - "సీన్" మారిపోయింది : మోహన్ బాబుకు ఛాన్స్ ఇవ్వకుండా..!!

By Chaitanya
|
Google Oneindia TeluguNews

సంక్రాంతి పండుగ సమయంలో కీలక భేటీ. మెగాస్టార్ చిరంజీవి నేడు (గురువారం) సీఎం జగన్ తో భేటీ కానున్నారు. కొద్ది కాలంగా టాలీవుడ్ వర్సస్ ఏపీ ప్రభుత్వం మధ్య కోల్డ్ వార్ కంటిన్యూ అవుతోంది. సినీ పరిశ్రమ నుంచి వ్యాఖ్యలు.. ఏపీ మంత్రుల రియాక్షన్ తో వివాదం మరింత ముదిరింది. ఈ సమయంలో మరోసారి మెగాస్టార్ ఎంట్రీ ఇస్తున్నారు. నేరుగా సీఎంతో సమావేశం అవుతున్నారు. కొద్ది రోజుల క్రితం తాను పంచాయితీలు చేయలేనని.. సినీ పెద్దగా ఉండలేనంటూ చిరంజీవి కీలక వ్యాఖ్యలు చేసారు. దీంతో..పెదరాయుడు ఒక ఓపెన్ లెటర్ రాసారు.

Recommended Video

AP Tickets Rates: Telugu Film Industry Lacks Unity - Mohan Babu | RGV | Oneindia Telugu
సీఎం జగన్ తో మెగాస్టార్ భేటీ

సీఎం జగన్ తో మెగాస్టార్ భేటీ

రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో చర్చించి..అందరం కలిసి సమస్యలు పరిష్కరించుకోవాలని సూచించారు. దీంతో..ఇక, మోహన్ బాబు సమస్యల పరిష్కారానికి నాయకత్వం వహిస్తారని.. చిరంజీవి ఈ ఇష్యూలో ఎంటర్ కారని అందరూ భావించారు. కానీ, సీన్ మారింది. చిరంజీవి నేరుగా సీఎంఓకు కాల్ చేసారు.

తాను సీఎం జగన్ తో కలిసేందుకు అప్పాయింట్ మెంట్ ఇవ్వాలని కోరారు. దీంతో..సీఎం జగన్ నుంచి ఈ రోజు మధ్నాహ్నం లంచ్ కు రావాలంటూ ఆహ్వానం అందింది. చిరంజీవి ఇప్పటికే సైరా సినిమా విడుదల తరువాత సతీ సమేతంగా ఒక సారి సమావేశమయ్యారు. ఆ సమయంలో సినీ పరిశ్రమ సమస్యలు ఏవైనా ఉంటే మీరే లీడ్ తీసుకొని తన వద్దకు తీసుకొస్తే పరిష్కరించుకుందామని సీఎం జగన్ నాడే ప్రతిపాదించారు.

లంచ్ మీట్ లో ఏం తేలుస్తారు

లంచ్ మీట్ లో ఏం తేలుస్తారు

ఆ తరువాత సినీ ప్రముఖులతో కలిసి రెండో సారి చిరంజీవి సీఎంతో భేటీ అయ్యారు. ఆ సమయంలో ప్రస్తావించిన పలు సమస్యలను పరిష్కరిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పలు సందర్భాల్లో సీఎం జగన్ నిర్ణయాలను చిరంజీవి ప్రశంసించారు. ఇక, పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలతో మొదలైన వివాదం..ఇప్పుడు అనేక మలుపులు తీసుకుంది.

టిక్కెట్ ధరల తగ్గింపు నిర్ణయం పైన టాలీవుడ్ లోని పలువురు ప్రముఖులు ఓపెన్ గానే తప్పు బడుతున్నారు. దీనికి మంత్రులు సైతం కౌంటర్ ఇస్తున్నారు. ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి వ్యాఖ్యలకు ధీటుగా పలువురు సినీ పరిశ్రమకు చెందిన వారు సీరియస్ గా స్పందించారు. సినిమా థియేటర్ల ఓనర్లు గగ్గోలు పెడుతున్నారు. టాలీవుడ్ పెద్దలు నేరుగా సీఎంతో చర్చలు చేస్తేనే పరిష్కారం వస్తుందని చెబుతూ వస్తున్నారు.

విషయం ముదురుతున్న వేళ

విషయం ముదురుతున్న వేళ

ఇక, విషయం ముదుురుతోందని గ్రహించిన చిరంజీవి.. నేరుగా రంగంలోకి దిగారు. సీఎం సైతం చిరంజీవితో చర్చలకు ఓకే అన్నారు. దీంతో..సినిమా టిక్కెట్ల వ్యవహారంతో పాటుగా అసలు ఏపీ ప్రభుత్వం సినీ పరిశ్రమ నుంచి ఏం కోరుకుంటోంది... ఏపీలో సినీ ప్రీ అండ్ పోస్టు ప్రొడక్షన్ పైన ఈ భేటీలో చర్చకు వచ్చే అవకాశం ఉంది. ఏపీలో తెలుగు సినీ పరిశ్రమ వాటా 53 శాతం ఉండగా.. ఆ మేరకు ినీ పరిశ్రమ నుంచి ఏపీకి ఏం వస్తుందనేది ఇప్పుడు సాగుతున్న చర్చ.

ఈ సమయంలోనే అసలు తెలుగు సినీ పరిశ్రమకు ఏపీ అనేది ఉందని.. సీఎం జగన్ ఇక్కడ ఉన్నారని గుర్తు ఉందా అంటూ వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. దీంతో చిరంజీవి అసలు విషయం ఏంటనేది బోధపడింది. ఏపీలోనూ పరిశ్రమ కార్యకలాపాలు ప్రభుత్వం కోరుకుంటుందనేది అర్దం అయింది.

పెరిగిపోతున్న గ్యాప్ కంట్రోల్ కోసం

పెరిగిపోతున్న గ్యాప్ కంట్రోల్ కోసం

మరోవైపు ఆర్జీవి లాంటి వారి లాజిక్ లతో ఇష్యూ డైవర్ట్ అవుతోందని కొందరు అభిప్రాయ పడుతున్నారు. దీంతో..నేరుగా సీఎంతో చర్చల ద్వారా అన్నింటి పరిష్కారానికి ఒక మార్గం దొరుకుతుందని భావించారు. ఇదే సమయంలో కరోనా కారణంగా పాన్ ఇండియా సినిమాల విడుదల వాయిదా పడింది. ఫిబ్రవరి లో చిరంజీవి సినిమా ఆచార్యతో సహా పలు సినిమాలు విడుదలకు సిద్దం అవుతున్నాయి. కరోనా కారణంగా ఏ నిర్ణయం తీసుకున్నా.. ఏపీ ప్రభుత్వంతో ఉన్న వివాదం పరిష్కరించుకోవాలనేది చిరంజీవి భావనగా కనిపిస్తోంది.

ఏం నిర్ణయిస్తారా.. పరిష్కారం దొరుకుతుందా

ఏం నిర్ణయిస్తారా.. పరిష్కారం దొరుకుతుందా


ఇదే సమయంలో సీఎం జగన్ తో ప్రారంభించిన చర్చలు..తనతోనే కొనసాగాలని.. తన ద్వారా ఈ సమస్యకు ఒక పరిష్కారం కోసం చొరవ తీసుకోవాలని చిరంజీవి భావించినట్లుగా అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. దీంతో.. తానే మరోసారి చొరవ తీసుకొని సీఎంతో సమావేశానికి ముందుకొచ్చారు. అయితే, ఈ సమవేశంలో సీఎం జగన్ - చిరంజీవి మధ్య ఎలాంటి చర్చలు జరుగుతాయి.. ఎలాంటి పరిష్కార మార్గం బయటకు వస్తుందనేది అటు టాలీవుడ్ లో..ఇటు పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారుతోంది.

English summary
Megastar Chiranjeevi was invited for lunch by CM Jagan on Thursday amid the movie ticket war going on in AP.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X