స్పీకర్ పైన క్లారిటీ - కొడాలి నాని స్థానంలో ఎవరంటే : రోజాకు ఖాయం..కానీ చివరి క్షణంలో..!!
ఏపీలో కొత్త మంత్రివర్గంలో ఛాన్స్ దక్కేదెవరికి. స్పీకర్ మారబోతున్నారా. ఫైర్ బ్రాండ్ రోజాకు స్థానం దక్కుతుందా. కొడాలి స్థానం భర్తీ చేసేదెవరు. ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారిన అంశాలు ఇవి. ముఖ్యమంత్రి జగన్ తొలి మంత్రివర్గం ఈ రోజు చివరి సారి సమావేశం కానుంది. ఆ తరువాత వారి రాజీనామా చేయనున్నారు. ఈ నెల 11న కొత్త కేబినెట్ కొలువు తీరనుంది. అయితే, స్పీకర్ గా ఉన్న తమ్మినేని సీతారాం కేబినెట్ లోకి రావాలని ప్రయత్నాలు చేస్తున్నట్లుగా ప్రచారం సాగుతోంది. కానీ, శ్రీకాకుళంలో ప్రస్తుతం డిప్యూటీ సీఎం గా ఉన్న ధర్మాన క్రిష్ణదాస్ స్థానంలో ఆయన సోదరుడు ధర్మాన ప్రసాదరావుకు మంత్రి పదవి ఖాయమని తెలుస్తోంది. అదే విధంగా సామాజిక సమీకరణాల్లో భాగంగా సిదిరి అప్పలరాజు కొనసాగనున్నారని సమాచారం.

స్పీకర్ గా తమ్మినేని కంటిన్యూ..!
దీంతో..స్పీకర్ గా తమ్మినేని కొనసాగటం ఖాయంగా కనిపిస్తోంది. స్పీకర్ గా ఆయనే ఉంటారని విశ్వసనీయ వర్గాల సమాచారం. అదే విధంగా.. ఫైర్ బ్రాండ్ మంత్రి కొడాలి నాని స్థానంలో ఎవరికి ఛాన్స్ వస్తుందనేది ఇంట్రస్టింగ్ ఈక్వేషన్ గా మారుతోంది. క్రిష్ణా జిల్లా నుంచి మంత్రిగా ఉన్న కొడాలి నాని స్థానంలో అదే జిల్లా లేకుంటే గుంటూరు జిల్లా నుంచి కమ్మవర్గానికి చెందిన వారికి ఛాన్స్ దక్కుతుందని భావించారు. కొడాలి నాని తాను జగన్ పైన అభిమానం చాటుకొనే క్రమంలో టీడీపీ అధినేత చంద్రబాబు పైన విరుచుకుపడటంలో ముందు వరసలో నిలిచారు. ఒక దశలో ఆయనకు మంత్రి పదవి రెన్యువల్ చేస్తారని భావించారు. కానీ, సీనియర్లను అందరినీ తప్పిస్తున్న సమయంలో కొడాలి నానిని తప్పించాల్సి వస్తోందని పార్టీ నేతలు చెబుతున్నారు.

కొడాలి నాని స్థానంలో అబ్బయ్య చౌదరి..?
అయితే, ఆయన స్థానంలో ఇప్పుడు పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్య చౌదరిని కేబినెట్ లోకి తీసుకుంటున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఆయన 2019 ఎన్నికల్లో చింతమనేని ప్రభాకర్ పైన విజయం సాధించారు. క్రిష్ణా జిల్లా నుంచి వసంత క్రిష్ణ ప్రసాద్..తలశిల రఘురాం పేర్లు సైతం కొడాలి నాని స్థానంలో రేసులో ఉన్నాయి. చివరి నిమిషంలో మార్పులు జరిగితే మినహా.. కొడాలి నాని స్థానంలో కమ్మ వర్గం నుంచి అబ్బయ్య చౌదరి పేరు ఖరారు ఖాయంగా కనిపిస్తోంది. ఇక, మరో ఫైర్ బ్రాండ్..నగరి ఎమ్మెల్యే రోజాకు మహిళా కోటాలో మంత్రి పదవి దక్కటం ఈ సారి ఖాయమని తెలుస్తోంది. ఇప్పటి వరకు రోజాకు కేబినెట్ బెర్తు ఖరారు అయిందనే ప్రచారం వైసీపీ ముఖ్య నేతల్లో వినిపిస్తోంది. అయితే, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని కేబినెట్ నుంచి తప్పించి.. పార్టీ బాధ్యతలు అప్పగించటం ద్వారా రోజాకు లైన్ క్లియర్ అవుతుంది.

రోజాకు ఖాయం కావాలంటే...
కానీ, పెద్దిరెడ్డిని కేబినెట్ నుంచి తప్పిస్తే..అదే జిల్లాకు చెందిన రెడ్డి వర్గం నుంచి రోజాతో పాటుగాగా చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర రెడ్డి.. భూమన కరుణాకర రెడ్డి సైతం రేసులో ప్రముఖంగా ఉన్నారు. అయితే, విజయనగరంలో సీనియర్ మంత్రి బొత్సాను తప్పించి..ఆయన కుటుంబానికే ప్రాధాన్యత ఇవ్వాలని భావిస్తున్న వేళ..అదే ఫార్ములా చిత్తూరులోనే వర్కవుట్ అవుతే రోజాకు ఛాన్స్ కష్టమయ్యే అవకాశం ఉంది. పెద్దిరెడ్డి సోదరుడు చిన్న సోదరుడు ద్వారకనాథరెడ్డి మొన్నటి ఎన్నికల్లో తంబలపల్లి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన కు ఇవ్వాలనే ప్రతిపాదన తెర మీదకు వస్తోంది. అయితే, పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి లోక్ సభలో పార్టీ ఫ్లోర్ లీడర్ గా ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో కుప్పం నుంచి మంత్రి పెద్దిరెడ్డి మరో సోదరుడి కుమారుడు సుధీర్ రెడ్డి పార్టీ అభ్యర్ధిగా ఖరారు చేసే అవకాశం కనిపిస్తోంది. 4.
Recommended Video


సీఎం జగన్ సమీకరణాలపై ఉత్కంఠ
వీటన్నింటితో.. మంత్రి పెద్దిరెడ్డికి పార్టీలో కీలక బాధ్యతలు అప్పగించి.. చిత్తూరు జిల్లా నుంచి రెడ్డి వర్గానికి చెందిన మరొకరికి ఛాన్స్ ఇవ్వాలనేది జగన్ ఆలోచనగా చెబుతున్నారు. చివరి నిమిషంలో ఎటువంటి సమీకరణాలు..ఆబ్లిగేషన్లు తెర మీదకు రాకుంటే రోజాకు మంత్రి పదవి ఖాయంగా కనిపిస్తోంది. ఈ సారి అయిదుగురు మహిళలకు మంత్రి పదవు లు ఇవ్వాలనేది సీఎం ఆలోచనగా తెలుస్తోంది. ఇది కూడా రోజాకు కలిసొచ్చే అంశం. దీంతో..సీఎం జగన్ తన కేబినెట్ తుది కూర్పు ఏ విధంగా డిసైడ్ చేస్తారనే ఉత్కంఠ పార్టీలో కొనసాగుతోంది.












Click it and Unblock the Notifications