వైసీపీ చేతికి టీడీపీ అస్త్రం - హ్యాట్రిక్ ఖాయమా, లెక్క క్లియర్..!!
ఏపీలో ఎన్నికలకు కౌంట్ డౌన్ మొదలైంది. ప్రధాన పార్టీలు ఎన్నికలకు సమాయత్తం అవుతున్నాయి. టీడీపీ,జనసేన, బీజేపీ కూటమిగా బరిలోకి దిగుతున్నాయి. జగన్ సింగిల్ గానే యుద్దానికి సిద్దమయ్యారు. అటు కాంగ్రెస్ వామపక్షాలతో జత కట్టింది. ఈ సమయంలో ప్రతీ నియోజకవర్గంలో గెలుపు ప్రధాన పార్టీలకు ప్రతిష్ఠాత్మకంగా మారుతోంది. అందులో భాగంగా కురుపాం నియోజకవర్గంలో ఈ సారి ఇద్దరు మహిళా నేతలు పోటీ పడుతున్నారు. అక్కడ పోటీ ఇప్పుడు ఆసక్తి కరంగా మారుతోంది.
వైసీపీ వర్సస్ టీడీపీ
కురుపాంలో వైసీపీ నుంచి మాజీ డిప్యూటీ సీఎం పాముల పుష్పశ్రీవాణీ పోటీ చేస్తున్నారు. వరుసగా రెండు సార్లు ఇక్కడ విజయం సాధించిన పుష్ఫశ్రీవాణి హ్యాట్రిక్ విజయం కోసం అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే ఎన్నికల ప్రచారంలో గడప గడపకు తిరుగుతున్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్దిగా తోయక జగదీశ్వరి ఎన్నికల ప్రచారం ప్రారంభించారు.

నియోజకవర్గంలో ఐదు మండలాలు ఉన్నాయి. అందులో గిరిజన జనాభా తక్కువుగా ఉన్న మండలాల్లో జనసేన ప్రభావం కొంత మేర కనిపిస్తోంది. బీజేపీకి పట్టు లేదనే చెప్పాలి. కూటమి అభ్యర్ది అయినా..ఇక్కడ పోటీ వైసీపీ - టీడీపీ మధ్యనే ఉంటుంది. రెండు సార్లు ఎమ్మెల్యేగా, డిప్యూటీ సీఎంగా ఈ ఐదు మండలాల్లో ప్రతీ గ్రామంలో పరిచయాలు.మద్దతు పుష్ఫశ్రీవాణికి కలిసొచ్చే అంశం.
వైసీపీకీ కలిసొచ్చేలా
స్థానిక సంస్థల ఎన్నికల్లో ఐదు మండలాల్లోనూ వైసీపీ ఏకపక్షంగా విజయం సాధించింది. దీంతో, ఇప్పుడు ఎన్నికల సమయంలో ప్రతీ గ్రామంలో ప్రభుత్వం నుంచి అందిన సంక్షేమం వివరిస్తూ ప్రతీ గడపకు వెళ్లి అండగా నిలవాలని కోరుతున్నారు. నియోజకవర్గంలో 92 శాతం మందికి ప్రభుత్వ పథకాలు అందాయి. ఇప్పుడు అదే ఓట్ బ్యాంక్ తో మూడో సారి గెలిచేందుకు పుష్ఫశ్రీవాణీ ముందుకు వెళ్తున్నారు.
నిన్న మొన్నటి వరకు కలిసికట్టుగా ఉన్న టీడీపీలోని సొంత పార్టీ నేతలతో సహా..మద్దతుగా నిలుస్తామని చెప్పిన జనసేన నేతలు సైతం జగదీశ్వరి ప్రచారంలో కనిపించటం లేదు. జగదీశ్వరికి టీడీపీ అధినేత చంద్రబాబు తొలి జాబితాలోనే సీటు ఖరారు చేసారు. దీంతో, అక్కడ సీటు ఆశించిన టీడీపీ నేతలు జగదీశ్వరికి సహకరించటం లేదని చెబుతున్నారు.

ఎన్నిక ఏకపక్షమేనా
అభ్యర్ది ఖరారుకు ముందే కురుపాం టీడీపీలో వర్గ పోరు ఉంది. ఇది వైసీపీకి కలిసొచ్చే అంశంగా మారుతోంది. వైసీపీలో పుష్పశ్రీవాణి మూడో సారి అభ్యర్దిగా నిలవటంతో పార్టీ కేడర్ తో పాటుగా.. స్థానికంగా ప్రజల నుంచి వస్తున్న మద్దతుతో విజయం పైన ధీమాగా ఉన్నారు. ఈ నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్దికి మద్దతుగా ఇప్పటి వరకు పరిస్థితులు సరిదిద్దేందుకు ఆ పార్టీ నాయకత్వం ఫోకస్ చేయటం లేదు.
టీడీపీ నేతలు కలిసి కట్టుగా పని చేసే అవకాశం కనిపించటం లేదు. కాంగ్రెస్ తో జత కట్టిన వామపక్ష పార్టీలు తమ కూటమి నుంచి అభ్యర్దిని ప్రకటించాల్సి ఉంది. దీంతో...స్వతంత్ర అభ్యర్దులు ఎవరైనా పోటీకి దిగినా.. త్రిముఖ పోరు కొనసాగే ఛాన్స్ కనిపిస్తోంది. ఒక దశలో ఇక్కడ టీడీపీ - వైసీపీ మధ్య గట్టి పోటీ ఉంటుందని భావించినా..క్షేత్ర స్థాయిలో పరిస్థితులు మాత్రం వైసీపీ వైపే మొగ్గు చూపుతున్నట్లు కనిపిస్తోంది.
-
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే! -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి?












Click it and Unblock the Notifications