ఆ లోకేష్ సన్నిహిత రాజ్యసభ అభ్యర్ధి ఆస్తులు చూస్తే షాక్..!
ఏపీలో ఖాళీ అయిన మూడు రాజ్యసభ సీట్లకు త్వరలో ఎన్నికలు జరగాల్సి ఉంది. ఈ మూడు సీట్ల కోసం కూటమి నుంచి ముగ్గురు అభ్యర్ధులు నామినేషన్లు దాఖలు చేశారు. టీడీపీ నుంచి బీద మస్తాన్ రావు, సానా సతీష్ బాబు, బీజేపీ నుంచి ఆర్ కృష్ణయ్య నామినేషన్లు వేశారు. వీరంతా తమ ఎన్నికల అఫిడవిట్లతో తమ ఆస్తులు, అప్పులు, కేసుల వివరాలను వెల్లడించారు. ఇందులో ఆర్ కృష్ణయ్య, బీద మస్తాన్ రావు సంగతి ఎలా ఉన్న సానా సతీష్ బాబు సమర్పించిన వివరాలు ఆసక్తికరంగా ఉన్నాయి.
సానా సతీష్ రాజ్యసభ ఎన్నికల కోసం సమర్పించిన అఫిడవిట్లో తనపై ఈడీ, సీబీఐ కేసులున్నట్లు తెలిపారు. అయితే ఇందులో వీటిపైనా ఛార్జిషీట్ దాఖలు కాలేదని వెల్లడించారు. అలాగే తన పేరుతో ఒక్క కారు కూడా లేదన్నారు. తన భార్య పేరుతో మాత్రం బెంజ్ కారు, రెండు ఇన్నోవా కార్లు ఉన్నాయన్నారు. అలాగే తనకు ఇల్లు, భూములు, ఆస్తులు లేవని, భార్య పేరుతో మాత్రం కాకినాడలో 3.87 కోట్ల విలువైన ఎకరం భూమి ఉందని తెలిపారు.

మరోవైపు సానా సతీష్ బాబు ఆదాయ వివరాలు మాత్రం ఆసక్తి కరంగా ఉన్నాయి. వైసీపీ అధికారంలో ఉండగా 2019-20లో రూ.10.67 లక్షల ఆదాయం వచ్చిందని, 2020-21లో కేవలం రూ.6170, 2021-22లో రూ.7790, 2022-23లో రూ.2.15 కోట్లు, 2023-24లో రూ.1.11 కోట్ల ఆదాయం వచ్చిందని అఫిడవిట్లో తెలిపారు. అంటే గత ఐదేళ్ల సానా సతీష్ ఆదాయం పరిశీలిస్తే..తీవ్రమైన హెచ్చుతగ్గులు ఉన్నాయి. వీటిపై ఇప్పుడు చర్చ జరుగుతోంది. లోకేష్ సన్నిహతుడిగా పేరున్న సానా సతీష్ బాబు రెండేళ్ల పాటు కేవలం ఏడాదికి ఆరేడు వేల రూపాయలు ఆదాయం సంపాదించానని చెప్పడం విశేషం.












Click it and Unblock the Notifications